Chiranjeevi Anil Ravipudi: భారీ ధరకు చిరు, అనిల్ రావిపూడి మూవీ ఓటీటీ డీల్? - మెగాస్టార్ మూవీ అంటే అట్లుంటది మరి
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగానే మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi Anil Ravipudi Movie OTT Deal Gone Viral: సాధారణంగా ఏదైనా మూవీ పూర్తైన తర్వాతే ఓటీటీ డీల్ ప్రస్తావన వస్తుంది. సినిమా రిజల్ట్ బట్టి ధర, స్ట్రీమింగ్ డేట్ నిర్ణయిస్తారు. మూవీ హిట్ అయితే 4 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. లేకుంటే అంతకంటే ముందుగానే స్ట్రీమింగ్ చేస్తారు. అయితే... వీటన్నికీ భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాంబో మరి...
టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన చిరంజీవి హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మెగాస్టార్ మూవీ అంటేనే ఓ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. దానికి తోడు స్టార్ డైరెక్టర్ కాంబో కావడంతో అది రెండింతలైంది.
ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లేనా?
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా... ఈ లోపే ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయినట్లు ఓ క్రేజీ న్యూస్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య డీల్ కుదిరిందని సమాచారం. కాంబినేషన్‌పై నమ్మకంతోనే అసలు టీజర్ కూడా రిలీజ్ కాక ముందే ఇంత ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోస్ మూవీస్ కూడా కొన్నిసార్లు ఓటీటీ డీల్ విషయంలో తక్కువ ధరకు వెళ్లడం చూస్తుంటాం. ఒకవేళ సినిమా రిజల్ట్ అటు ఇటూ అయితే ఆ ధర పడిపోవచ్చు. రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ విషయంలో ఇదే ఇబ్బందులు ఫేస్ చేశాయి. కానీ... చిరు మూవీకి మాత్రం... షూటింగ్ జరుగుతుండగానే ఇంత భారీ ధర రావడంపై ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
Also Read: 'మారెమ్మ'లో మాస్ మహారాజ్ ఫ్యామిలీ హీరో... మాధవ్ భూపతిరాజు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ చూశారా?
చిరు రోల్ ఏంటంటే?
ఈ సినిమాలో మెగాస్టార్ ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ పాత్రలోనే ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కిస్తుండగా... 'సంక్రాంతి' అనే వర్డ్ మిక్స్ అయ్యేలా టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.
ఫస్ట్ గ్లింప్స్ అప్పుడే
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్ కూడా డైరెక్టర్ అనిల్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
గెస్ట్ రోల్‌లో వెంకీ
ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఓ పాటలో కూడా వెంకీ కనిపిస్తారని తెలుస్తోంది. రమణ గోగులతో ఓ పాట పాడించగా... చిరు కూడా ఓ పాట పాడతారనే టాక్ వినిపిస్తోంది.
చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. మూవీలో కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయనున్నారు.





















