OTT Tamil Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తమిళ కామెడీ డ్రామా - ప్రొడ్యూస్ చేసింది రజనీకాంత్ డైరెక్టరే... సినిమాను ఎందులో చూడాలంటే?
Bloody Beggar OTT Streaming: కెవిన్ రాజ్ హీరోగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించిన ‘బ్లడీ బెగ్గర్’ ఓటీటీలోకి వచ్చింది. ఈ కామెడీ డ్రామా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
తమిళ హీరో కెవిన్ రాజ్(Kavin Raj) ‘లిఫ్ట్’ అనే హారర్ సినిమా ద్వారా నేరుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆయన రెండో చిత్రం ‘దాదా’ అటు థియేటర్లలోనూ, ఆ తర్వాత ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. కానీ భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మేలో విడుదలైన ‘స్టార్’ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ‘డాక్టర్’, జైలర్’ సినిమాల ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) కెవిన్ హీరోగా ‘బ్లడీ బెగ్గర్’(Bloody Beggar) నిర్మించారు. ఎన్నో అంచనాలతో దీపావళి సందర్భంగా (అక్టోబర్ 31) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోస్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘బ్లడీ బెగ్గర్’ (Bloody Beggar)
‘బ్లడీ బెగ్గర్’ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ రోజు (నవంబర్ 29) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి తమిళ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి, ఇతర భాషల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో? త్వరలో తెలుగు వెర్షన్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాక్.
View this post on Instagram
బ్లడీ బెగ్గర్ సినిమా కథ ఏంటంటే?
ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరో కెవిన్ (Kavin Raj) ఈ సినిమాలో ఓ బిచ్చగాడి పాత్ర పోషించారు. దర్శకుడు శివబాలన్ కథకు నెల్సన్ తాలూకు డార్క్ హ్యూమర్ టచ్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కెవిన్ పాత్ర అంటే ప్రేక్షకుడికి అస్సలు జాలి కలగదు. దివ్యాంగునిగా నటిస్తూ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బిచ్చం ఎత్తుకుంటూ, ఇనుప సామాన్లను అమ్ముకుంటూ ఉంటుంది కెవిన్ పాత్ర (బిచ్చగాడి పాత్రకు ఎటువంటి పేరూ ఉండదు). అతని దగ్గర స్కూల్ కి వెళ్లే పిల్లాడు జాక్ ఉంటాడు. ఆ పిల్లాడికీ అతనంటే చాలా కోపం. అన్నదానం కోసం ఓ పెద్ద బంగళాలోకి వెళతాడు బిచ్చగాడు. అది ఓ పెద్ద నటుడి ఇల్లు. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అయితే బిచ్చగాడు భోజనం చేసి, ఆ బంగ్లాలోనే పొరపాటున ఇరుక్కుపోతాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆస్తుల కోసం కొంత మంది మనుషులు ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని నవ్విస్తూనే చూపిస్తాడు దర్శకుడు. తెలుగు నటుడు ‘30 ఇయర్స్’ పృథ్వీ, రెడిన్ కింగ్ స్లే, సలీమా, సునీల్ సుఖ్దా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జెన్ మార్టిన్ స్వరకర్త. ‘స్టార్’, ‘బ్లడీ బెగ్గర్’ సినిమాలు టీజర్, ట్రైలర్స్ స్థాయిలో మంచి బజ్ సంపాదించాయి. కానీ విడుదల తర్వాత పూర్తి గా నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నెల 7న విడుదలైన ‘బ్లడీ బెగ్గర్’ తెలుగు వెర్షన్ కూడా ఇక్కడి ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
Also Read: హలో 'బ్రదర్'... ‘జయం’ రవి, ప్రియాంక జంటగా నటించిన తమిళ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
సీరియల్ యాక్టర్ గా బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించిన కెవిన్, తమిళ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, క్రేజీ ఆఫర్స్ మాత్రం కెవిన్ ను పలకరిస్తున్నాయి. కెవిన్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా తమిళ దర్శకుడు వెట్రిమారన్(Vetrimaaran) ‘మాస్క్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. మరో సినిమాలో నయనతార (Nayanthara) సరసన హీరోగా నటిస్తున్నారు కెవిన్.
Also Read: తెలుగు ఓటీటీలోకి టోవినో థామస్ 'నారదన్'... మలయాళంలో విడుదలైన రెండేళ్లకు