(Source: ECI/ABP News/ABP Majha)
Best Thriller Movies On OTT: గుడ్డు నుంచి పుట్టిన మనిషి - తల్లిని ఇబ్బంది పెట్టినవారిని క్రూరంగా చంపేస్తుంది
Movie Suggestions: ఈ సినిమాలో ముందుగా పక్షి గుడ్డు నుండి ఒక వింత ఆకారం పుడుతుంది. ఆ తర్వాత అదే మనిషిలాగా మారుతుంది. తన తల్లిగా భావించే అమ్మాయిని ఇబ్బందిపెట్టిన వారిని చంపేస్తుంది.
Best Thriller Movies On OTT: జంతువులకు మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుందని అంటుంటారు. అందుకే ఏ జంతువు అయినా ఒక మనిషికి దగ్గరయితే వారిని అమితంగా ప్రేమిస్తుంది. కానీ ఆ ప్రేమకు హద్దులు ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ‘హ్యాచింగ్’ సినిమా కథ. తల్లిదండ్రులు సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే పిల్లల మానసిక పరిస్థితి ఎలా అయిపోతుంది అని కూడా ‘హ్యాచింగ్’లో బాగా చూపించారు దర్శకుడు హానా బెర్ఘోల్హ్మ్. ఇక ఫిన్నిష్ భాషలో తెరకెక్కిన ఈ మూవీ ఇంగ్లీష్‌లో కూడా డబ్ అయ్యింది.
కథ..
ముందుగా ఈ సినిమాలో ఒక కుటుంబాన్ని చూపిస్తారు. ‘హ్యాచింగ్’ ఎక్కువగా తల్లి, కూతురిపైనే ఆధారపడి ఉంటుంది. కూతురు టింజా (సిరి సోలాలిన్నా) ఒక జిమ్నాస్ట్. తన తల్లి మట్కా (సోఫియా హీక్కిలా).. ఒక యూట్యూబ్ వ్లాగర్. తన పర్సనల్ లైఫ్ విషయాలను, ఫ్యామిలీ విషయాలను యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లతో షేర్ చేసుకోవడం మట్కాకు అలవాటు. టింజా పెద్ద జిమ్నాస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని మాట్కా ఆశపడుతుంది.
అందువల్లే తనను ఎక్కువగా ఎవరితో కలవనివ్వదు. ఒకరోజు అద్దం బద్దలుకొట్టుకొని మట్కా ఇంట్లోకి ఒక కాకి వస్తుంది. మట్కా దానిని చంపేస్తుంది. కానీ ఒకరోజు రాత్రి కాకి అరిచినట్టుగా టింజాకు వినిపించడంతో తన ఇంటి పక్కన ఉండే అడవిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడే తనకు ఒక గుడ్డు దొరుకుతుంది. అది తెచ్చుకొని తను జాగ్రత్తగా దాచిపెడుతుంది. అదే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
తన ఇంట్లో పరిస్థితులు, స్నేహితులు లేకపోవడం, జిమ్నాస్ట్‌గా తను అనుకున్నది సాధించలేకపోవడం ఇవన్నీ టింజాను బాధపెడతాయి. మరుసటి రోజు చూస్తే తను తెచ్చుకున్న గుడ్డు.. విపరీతంగా సైజ్ పెరిగిపోయి ఉంటుంది. దానిని పట్టుకొని తను ఏడుస్తుంది. వెంటనే ఆ గుడ్డు పగిలి, అందులో నుంచి ఒక వింత పక్షి బయటికి వస్తుంది. ముందుగా దానిని చూసి టింజా భయపడినా కూడా మెల్లగా దానికి దగ్గర అవుతుంది. దానికి అలీ అనే పేరు పెడుతుంది.
అలీ.. టింజాను తల్లిలాగా భావిస్తుంది. అలీ కోసం తాను పక్షి గింజెలు తిని వాటిని వాంతి చేసుకుంటుంది. దానిని అలీ తింటుంది. మెల్లగా అలీ రూపం మారుతూ టింజాలాగా కనిపించడం మొదలవుతుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి టింజాకు ఎవరి వల్ల అయినా కాస్త ఇబ్బంది కలిగినా వారిని అలీ చంపేస్తుంది. అచ్చం టింజాలాగానే ఉండడంతో ఇదంతా నిజంగానే టింజానే చేస్తుందని అందరూ అనుకోవడం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ.
మంచి సోషల్ మెసేజ్..
మామూలుగా హారర్ సినిమాల్లో ఉండే చాలావరకు ఎలిమెంట్స్ ‘హ్యాచింగ్’లో కూడా ఉన్నాయి. కానీ ఇందులో ప్రేక్షకులకు సోషల్ మెసేజ్ ఇవ్వడంపైనే దర్శకురాలు హానా బెర్ఘోల్హ్మ్ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. మామూలుగా ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే పిల్లల మానసిక పరిస్థితి ఎలా మారుతుంది అనే విషయాన్ని హానా బాగా చూపించారు.
తల్లి సోషల్ మీడియా అడిక్ట్ అవ్వడం వల్ల టింజా ఒక పక్షికి దగ్గరయ్యింది. చివరికి దాని వల్లే తన జీవితం మారిపోయింది. ఈ అంశాన్ని సినిమా మొత్తం బాగా నడిపించారు డైరెక్టర్. హారర్ సినిమా కావాలి, అందులో ఎక్కువ హారర్ ఉండకూడదు అనుకునే ప్రేక్షకులు ‘హ్యాచింగ్’ను ట్రై చేయవచ్చు. 2022లో విడుదలయిన ఈ మూవీ.. కేవలం 91 నిమిషాలు మాత్రమే. తాజాగా ఇంగ్లీష్ ఆడియోతో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యింది ‘హ్యాచింగ్’.
Also Read: ఇదెక్కడి ప్రేమరా బాబు, పెళ్లయిన మహిళను ప్రేమిస్తాడు - ఏకంగా తన మాంసాన్నే రుచి చూపిస్తాడు, చివరికి..