Amazon Prime Video: అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు పండగే - బోలెడన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు - తెలుగు ప్రాజెక్టులు కూడా - ఏకంగా నాగచైతన్యతో!
Amazon Prime Video Upcoming Web series: అమెజాన్ ప్రైమ్ వీడియో రానున్న రెండు సంవత్సరాల్లో విడుదల కానున్న వెబ్ సిరీస్, సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో రానున్న రెండు సంవత్సరాలకు గానూ మనదేశంలో విడుదల చేయనున్న వెబ్ సిరీస్, సినిమాల వివరాలను వెల్లడించింది. వీటిలో మొత్తంగా 40కి పైగా వెబ్ సిరీస్, సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రకటించింది. దీంతోపాటు మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్, అమ్ము అనే సినిమా కూడా తమ ప్లాట్‌ఫాంలో త్వరలో స్ట్రీమ్ అవుతాయని తెలిపింది.
మోడర్న్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్‌లో ఆది పినిశెట్టి, నిత్య మీనన్, రీతూ వర్మ, సుహాసిని మణిరత్నం, రేవతి, నరేష్, మాళవికా నాయర్, అభిజిత్ (బిగ్ బాస్ ఫేం), నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్క గుప్తా నటిస్తున్నారు. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. అమ్ము సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
దీంతోపాటు సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు అయిన మిర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్‌ల్లో సీజన్ 3ని అధికారికంగా ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 3, మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2, ముంబై డైరీస్ సీజన్ 2, పాతాళ్ లోక్ సీజన్ 2, కామిక్‌స్తాన్ సీజన్ 3, బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్ సీజన్ 2 కూడా ప్రస్తుతం నిర్మాణంగాలో ఉన్నాయి.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ వివరాలను కూడా అమెజాన్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, ఇషా తల్వార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఆర్య హీరోగా ‘ది విలేజ్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను, ఐశ్వర్య రాజేష్, కతిర్ కీలక పాత్రల్లో ‘సుళల్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా ప్రకటించింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్‌ను కూడా అమెజాన్ నిర్మిస్తుంది. అయితే వీటిలో ఒక్క సినిమా లేదా సిరీస్‌కు సంబంధించిన విడుదల తేదీని కూడా అమెజాన్ ప్రకటించలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
Presenting a power packed line up of content to keep you entertained! 💫 Immerse yourself in these stories and #SeeWhereItTakesYou 🍿#PrimeVideoPresentsIndia pic.twitter.com/QfKrP8IEJW
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022