Akka Teaser : బోల్డ్ లుక్‌లో 'అక్క'గా వస్తోన్న కీర్తి సురేశ్.. రాధిక ఆప్టేతో కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేస్తోందిగా
Keerthy Suresh's Akka Teaser : హీరోయిన్ కీర్తి సురేశ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది.

Akka Teaser Out : కీర్తి సురేశ్ (Keerthy Suresh), రాధిక ఆప్టే (Radhika Apte)ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ 'అక్క'Next On Netflix Indiaలో భాగంగా.. దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్రేజీ టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కీర్తి సురేష్ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీరియస్‌గా, బోల్డ్ లుక్‌లో వాక్ చేస్తూ.. అందరిని స్టన్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ను యష్ రాజ్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ను నిర్మించింది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ వెబ్ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పేర్నూరుకు చెందిన ఓ అమ్మాయి పతనంపై రివేంజ్ ఎలా తీర్చుకున్నారనే అనే అంశంతో దీనిని తెరకెక్కించారు. ఇదే విషయాన్ని చెప్తూ.. నెట్‌ఫ్లిక్స్.. The matriarchy stands strong. A rebel plots their downfall ♟️🔥 A girl from Pernuru seeks revenge against the Akkas. Akka is coming soon, only on Netflix. అనే క్యాప్షన్‌తో టీజర్‌ను షేర్ చేసింది.
View this post on Instagram
ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. గన్స్, గోల్డ్, మర్డర్, రక్తపాతాన్ని చూపిస్తూ.. టీజర్‌ని విడుదల చేసి.. సిరీస్‌పై అంచనాలను పెంచేశారు. కీర్తి సురేశ్, రాధిక ఆప్టే ఇద్దరూ కూడా ఇంటెన్స్ లుక్స్‌తో టీజర్లో కనిపించారు. రాధిక ఆప్టే ఇప్పటివరకు ఎన్నో సినమాలు, సిరీస్‌లలో బోల్డ్ లుక్‌లో కనిపించి మెప్పించింది. కీర్తి సురేశ్ కూడా తన లుక్స్, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ బోల్డ్ లుక్‌లో కనిపించలేదు కీర్తి. ఇది కీర్తి అభిమానులకు కాస్త షాక్‌నే ఇచ్చింది.
పెళ్లికి ముందు ట్రెడీషనల్ లుక్‌లో ఎక్కువగా కనిపించిన కీర్తి.. పెళ్లి తర్వాత మోడ్రన్ లుక్స్‌లో బేబి సినిమా ప్రమోషన్స్ చేసింది. సినిమాకి తగ్గట్లు ఆ లుక్‌ని ఎంచుకుంది అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అయితే ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ లుక్‌లో కనిపించి నెట్‌ఫ్లిక్స్‌లో థ్రిల్లర్ సిరీస్ చేస్తోంది ఈ బ్యూటీ. రాధిక, కీర్తి ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఈ రివేంజ్ డ్రామాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ వేదిక ప్రేక్షకులను అలరించనుంది.






















