Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Akhil Akkineni Lenin : అఖిల్ అక్కినేని రూరర్ మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' జులై 10న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు ముందే డిజిటల్ రైట్స్ ఫిక్స్ అయిపోయాయి.

Akhil Akkineni's Lenin OTT Platform Locked : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేం మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్‌గా నిలిచింది. రిలీజ్‌కు ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది.
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
'లెనిన్' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత జీ తెలుగు, జీ సీనిమాలు ఛానళ్లలో టీవీ ప్రీమియర్ కానుంది. జులై 10న సినిమా రానుండగా... సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ మూవీలో అఖిల్, భాగ్యశ్రీలతో పాటుగా శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి.
Also Read : Kotha Malupu : ఓటీటీలోకి సింగర్ సునీత కొడుకు కొత్త మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
అసలు స్టోరీ ఏంటంటే?
అఖిల్ ఖాతాలో ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. అందుకే ఈసారి మంచి రూరల్ యాక్షన్ డ్రామా స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్రైలర్‌లో రాయలసీమ యాస డైలాగ్స్, మాస్ యాక్షన్ అదిరిపోయాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామం. పవిత్రమైన గ్రామంలో రక్తం చిందించకూడదనేది అక్కడి గ్రామస్థుల విశ్వాసం. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఊరిలో జాతర ఎంతో ప్రత్యేకం. అలాంటి టైంలో గ్రామంలో రక్తం ఎందుకు చిందింది? కురుక్షేత్రంలో హీరో ఎందుకు ప్రశాంతమైన యుద్ధం చేయాల్సి వచ్చింది? ఈ కురుక్షేత్రంలో కౌరవులు ఎవరు? ఆఖరి ఘట్టంలో ఎందుకు హీరో హింసతో ఆయుథం పట్టాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : Satluj OTT : రెండు రోజులకే ఓటీటీలో డిలీట్ - 'సట్లెజ్' మూవీ కాంట్రవర్సీ ఏంటి?... మళ్లీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























