Adhrushyam Movie Streaming: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ - సూర్య హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా!
Ini Utharam Telugu Version OTT Release in ETV WIN: మలయాళంలో రెండేళ్ల క్రితం విడుదలైన అపర్ణా బాలమురళి సినిమా ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది.

మలయాళీ కథానాయిక అపర్ణా బాలమురళి (Aparna Balamurali) మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్ సరసన 'ఆకాశం నీ హద్దురా' (Aakasam Nee Haddura Movie) సినిమాలో ఆవిడ నటించారు. ఆవిడ నటించిన సినిమా ఒకటి థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో విడుదల అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
తెలుగులోకి 'అదృశ్యం'గా మలయాళ 'ఇని ఉత్తరన్'
Adhrushyam Movie Streaming On ETV WIN: అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సినిమా 'ఐని ఉత్తరన్'. కేరళలో అక్టోబర్ 7, 2022లో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో 'అదృశ్యం' పేరుతో డబ్బింగ్ చేశారు. కానీ థియేటర్లలో విడుదల చేయలేదు. డైరెక్టుగా ఈటీవీ విన్ యాప్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
View this post on Instagram
క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా 'అదృశ్యం' తెరకెక్కింది. ఇందులో అపర్ణా బాలరమురళితో పాటు కోలీవుడ్ నటుడు హరీష్ ఉత్తమన్, మాలీవుడ్ యాక్టర్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. సైలెంట్‌గా ఈటీవీ విన్ సినిమాను విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉంది.
Adhrushyam Movie Cast And Crew: 'అదృశ్యం' చిత్రానికి సుదీష్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'ఖుషి', న్యాచులర్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మంచి సామాజిక సందేశానికి క్రైమ్ జోడించి దర్శకుడు సుదీష్ రామచంద్రన్ చక్కగా సినిమాను తెరకెక్కించారని, అపర్ణా బాలమురళి అద్భుతంగా నటించారని మలయాళంలో రివ్యూలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: విజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్
'అదృశ్యం' సినిమా కథ ఏమిటంటే?
'అదృశ్యం' సినిమాలో అపర్ణా బాలమురళి పేరు డాక్టర్ జానకి గణేష్. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అశ్విన్ (సిద్ధార్థ్ మీనన్)ను ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. అంతలో తాను మర్డర్ చేశానని పోలీసుల దగ్గరకు వెళుతుంది జానకి. ఆమె నిజంగా హత్య చేసిందా? లేదా? ఒక ఫ్యాక్టరీలో కార్మికులు చేస్తున్న సమ్మెకు, హోమ్ మంత్రికి, జానకికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: నిఖిల్ 'స్వయంభు'లో నభా నటేష్ - యువరాణిగా ఫస్ట్ లుక్ చూశారా?
'ఆకాశం నీ హద్దురా' సినిమాలోని తన నటనతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల్ని అపర్ణా బాలమురళి ఆకట్టుకున్నారు. ఆమె నటన మెచ్చిన నేషనల్ అవార్డుల కమిటీ జ్యూరీ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం ప్రకటించింది. మలయాళ, తమిళ సినిమాల్లో అపర్ణా బాలమురళి ఎక్కువ నటిస్తున్నారు. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. అన్నట్టు... ఆమె సింగర్ కూడా! మలయాళంలో కొన్ని సాంగ్స్ పాడారు. ప్రజెంట్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

