అన్వేషించండి

3 Body Problem: ‘3 బాడీ ప్రాబ్లం’ వెబ్ సీరిస్‌కు ఊహించని స్పందన - ఆ రెండు నవలలకు పెరిగిన డిమాండ్, ఎందుకంటే?

3 Body Problem: నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలయిన ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ వల్ల అమెజాన్‌లో రెండు పుస్తకాల సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇలా కూడా జరుగుతుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

3 Body Problem Web Series: పుస్తకాలపై ఆధారపడి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కడం కామన్. ఎక్కువశాతం పుస్తకాల వల్ల సినిమాలకు పాపులారిటీ లభిస్తుంది. కానీ సినిమాలు, సిరీస్‌లు వల్ల పుస్తకాలకు పాపులారిటీ లభించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఒక వెబ్ సిరీస్ వల్ల అదే జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ వల్ల అమెజాన్‌లో రెండు పుస్తకాల అమ్మకం విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో అసలు ఈ వెబ్ సిరీస్ చూడనివారు, పుస్తకాలు చదవని వారు ఇదంతా దేని గురించి అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

ఆ రెండు పుస్తకాలకు డిమాండ్..

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే ఒక వెబ్ సిరీస్ విడుదలయ్యింది. మామూలుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాగే దీనికి కూడా లభించింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. ఇది ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. దీంతో ఈ పుస్తకానికి సేల్స్ అమాంతం పెరిగిపోయాయని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ‘3 బాడీ ప్రాబ్లమ్’ సిరీస్‌లో ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం గురించి కూడా పదేపదే ప్రస్తావన వచ్చింది. దీంతో దాని సేల్స్ కూడా ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ల వల్ల పుస్తకాలకు క్రేజ్ లభించింది కాబట్టి అదేంటో తెలుసుకోవాలని సిరీస్‌ను చూడాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు.

గ్రహంతరవాసులు, సైంటిస్టుల మధ్య కథ..

చైనీస్ రచయిత లియు సిక్సిన్ రచించిన సైఫై బుక్ సిరీసే ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’. ఇందులో విశ్వంలోని ఎన్నో విషయాలను ఆయన ప్రశ్నించారు. ఈ పుస్తకాన్ని దాదాపుగా వెబ్ సిరీస్‌గా మార్చారు మేకర్స్. ఇక ‘3 బాడీ ప్రాబ్లమ్’ సిరీస్‌లో ట్రైసోలారిస్ అనే గ్రహాన్ని గ్రహంతరవాసులు ఆక్రమించుకుంటారు. ఆ సమయంలో అక్కడి మనుషులు ఏం చేశారు అనే అంశంపై సిరీస్ సాగుతుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ డేవిడ్ బెనియోఫ్, డీబీ వెయిస్, అలెక్సాండర్ వూ కలిసి ‘3 బాడీ ప్రాబ్లమ్’ను తెరకెక్కించారు. గ్రహంతరవాసులు వచ్చి ఆ గ్రహాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేశారు అనే విషయాన్ని ఈ సిరీస్‌లో స్పష్టంగా చూపించారు.

బెస్ట్ సెల్లర్‌..

ముందుగా లిల్లీస్ సిరీస్ మ్యానియాలో ‘3 బాడీ ప్రాబ్లమ్’ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. కానీ ఆ స్క్రీనింగ్ తర్వాత ఈ సిరీస్‌కు మిక్స్‌డ్ రివ్యూలు లభించాయి. ఈ వెబ్ సిరీస్‌ను చాలా తెలివిగా తెరకెక్కించారని చాలామంది అభిప్రాయపడ్డారు. కాన్సెప్ట్ బాగున్నా కూడా కొంచెం అతిగా ఉందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే సిరీస్ ఇలా ఉంటే.. ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ పుస్తకం ఎలా ఉంటుందో అనే ఉద్దేశ్యంతో చాలామంది ప్రేక్షకులు.. అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని కొనడానికి ముందుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఇది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా మారింది. ‘3 బాడీ ప్రాబ్లెమ్’లో కీలక పాత్ర అయిన యే వెంజీ అనే మహిళ.. ఎప్పుడూ ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని చదివి అసలు విశ్వం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే అమెజాన్‌లో ఈ బుక్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget