Disney Hotstar: ఇక థియేటర్ అనుభూతిని ఇంట్లోనే పొందొచ్చు, ‘డిస్నీ హాట్‌స్టార్’ అదిరిపోయే అప్‌డేట్!
వినియోగదారులకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్ స్టార్ అదిరిపోయే వార్త చెప్పింది. హెడ్ ఫోన్స్‌తో డాల్బీ అట్మాస్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నది. ఇకపై యూజర్లు సరికొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్. తాజాగా ఈ సంస్థ, డాల్బీ లేబొరేటరీస్ కలిసి యూజర్స్ కు అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రెడీ అయ్యింది. ఈ ఓటీటీలో యూజర్స్ కు డాల్బీ అట్మాస్ అనుభూతిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు డిస్నీ+హాట్‌స్టార్ కీలక ప్రకటన చేసింది. అంతేకాదు.. డాల్బీ అట్మాస్ ప్లే బ్యాక్ ను సైతం అందించబోతున్నది. టీవీలు, ఏవీఆర్ లు, సౌండ్ బార్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఐఓఎస్ డివైజ్ ల్లోనూ సరికొత్త డాల్బీ అట్మాస్ ఎక్స్‌పీరియన్స్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకునే యూజర్లు ఈ సౌండ్ తో మూవీస్, వెబ్ సిరీస్‌ను థియేటర్ లెవల్లో అనుభూతి పొందే అవకాశం ఉంటుంది.
తమ ప్లాట్ ఫామ్‌పై యూజర్లకు డాల్బీ అట్మాస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంపై డిస్నీ స్ట్రీమింగ్ డెవలపింగ్ మార్కెట్స్ ప్రోడక్ట్ హెడ్ సిద్ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. డాల్బీ లేబొరేటరీస్ తో తమ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో యూజర్లకు మరింత టెక్నాలజీతో కూడిన సేవలను అందించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్‌లోని కొన్ని షోలను ఈ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఎక్స్ పీరియన్స్ తో చూసే వెసులుబాటు ఉంది. ఈ షోలలో హోమ్ శాంతి, రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్, నవంబర్ స్టోరీ, హ్యూమన్, గ్రహణ్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్, ఆర్య, శూర్‌వీర్, మాసూమ్, ఘర్ వాప్సీ, ఔట్ ఆఫ్ లవ్, స్పెషల్ ఓపీఎస్ 1.5, విక్రమ్, ఎ థర్స్‌డే లాంటి వెబ్ సిరీస్, సినిమాలు ఉన్నాయి. అటు టైటిల్ లిస్టింగ్ పేజీలో 'డాల్బీ బ్యాడ్జ్' కోసం వెతకడం ద్వారా డిస్నీ+ హాట్ స్టార్ యాప్ లో డాల్బీలోని కంటెంట్ ను వినియోగదారు సులభంగా గుర్తించే అవకాశం ఉంది.
డిస్నీ+హాట్ స్టార్ లో తీసుకొచ్చిన డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఎక్స్ పీరియన్స్ పట్ల వినియోగదారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న కంటెంట్ తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోని మొత్తం కంటెంట్ కు ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇలా చేయడం మూలంగా మరింత మంది యూజర్లు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. అటు డిస్నీ+హాట్ స్టార్ నిర్ణయంతో వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పోటీ ఓటీటీలు సైతం ఇదే బాటలో ప్రయాణించే అవకాశం ఉంటుందంటున్నారు.
అటు డిస్నీ+ హాట్ స్టార్ తన సబ్ స్క్రైబర్ పరిధిని మరింత విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. తక్కువ ధరలో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లను తీసుకొస్తున్నది. ఒకప్పుడు ఏడాది మాత్రమే ఉన్న సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఉండగా ప్రస్తుతం ప్రస్తుతం నెల, ఆరు నెలల ప్లాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ప్రస్తుతం మంచి జనాదరణ ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో డిస్నీ+ హాట్ స్టార్ టాప్ లో కొనసాగుతుంది.
Also Read : మా సినిమాను 'బాహుబలి', 'పొన్నియన్ సెల్వన్'తో కంపేర్ చేయడం లేదు!