News
News
X

Oscars Best Actor: తారక్‌కు అరుదైన గుర్తింపు, ఆస్కార్ టాప్-10 బెస్ట్ యాక్టర్స్‌లో చోటుకు ఆస్కారం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్స్ బ్యాలెట్ టాప్ 10 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నాడు

FOLLOW US: 
Share:

టన, డ్యాన్స్ విషయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డెడికేషన్, కష్టపడేతత్వంతో టాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. సినిమాలో తన క్యారెక్టర్ ఏదైనప్పటికీ నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తారు. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే ఇప్పటి వరకు ఏ భారతీయ నటుడికి దక్కని రేర్‌ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకీ అదేంటంటే.. ఆస్కార్‌ టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రెడిక్షన్స్‌లో తారక్‌ స్థానం సంపాదించారు. లాస్ఏంజిల్స్‌లో జరగబోయే గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమంలో తారక్‌ గోల్డెన్ స్టాట్యూట్‌ని దక్కించునే అవకాశం కూడా లేకపోలేదని అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ Variety పేర్కొంది. జనవరి 10న 80వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించనున్నారు. 

దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో తారక్ భీమ్‌ పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సీతారామ రాజు పాత్రల్లో నటించారు. ఇండియాలోనే కాకుండా అమెరికా, జపాన్, రష్యాలోనూ ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకు గానూ ఇటీవల జక్కన్న న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్‌ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆస్కార్ వరిస్తుందని ప్రేక్షకులు ఆశించారు. కానీ కుదరలేదు.

ఆస్కార్ రాకపోయినా ఈ సినిమా కోసం పనిచేసిన వారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుండటంతో ప్రస్తుతం తారక్ తన కుటుంబంతో అమెరికాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కార్యక్రమానికి ఆర్.ఆర్‌.ఆర్ టీంతో కలిసి హాజరుకానున్నట్లు తెలిసింది. మరోవైపు రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి లాస్‌ ఏంజెల్స్‌కు బయలుదేరిపోయారు. వీరిద్దరి ఎయిర్‌పోర్ట్ ఫొటోలు, వీడియోను సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు అజయ్ దేవగణ్‌ పాల్గొంటారో లేదో తెలియాల్సి ఉంది. ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆలియా భట్ సినిమాల నుంచి కొంత విరామం తీసుకుంది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఆలియా సీత పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించింది. అజయ్‌ దేవగణ్‌ చరణ్‌కు తండ్రి పాత్రలో కనిపించారు.

ఈ ఆస్కార్స్ బెస్ట్ యాక్షన్ ప్రెడిక్షన్స్ లిస్ట్‌లో హ్యూగ్ జాక్‌మ్యాన్, విల్‌ స్మిత్‌ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఉన్నారు. వారికి సమానంగా ఆ లిస్ట్‌లో పేరును సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు తారక్‌ కావడం నిజంగా గర్వకారణమే. ప్రస్తుతం తారక్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమా. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో పాటు ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన బ్లాక్‌ అండ్ వైట్ పిక్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 

Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!

Published at : 06 Jan 2023 04:03 PM (IST) Tags: RRR oscars NTR Golden Globes

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!