Nuvvunte Naa Jathaga Serial Today November 28h:మిధున గత జ్ఞాపకాలను మరిచిపోయేలా చేసేందుకు రిషి ఏం చేశాడు..?
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 28th: రిషితో మిధున పెళ్లి జరగబోతుందని తెలిసిన భాను ఆనందంతో గెంతులేస్తుంది. అటు మిధున తండ్రి కూడా చాలారోజులకు మిధున ముఖంలో నవ్వు చూసి ఆనందపడతాడు.

Nuvvunte Naa Jathaga Serial Today Episode: మిధునను తీసుకుని బయటకి వెళ్లిన రిషి..తన ప్రెండ్ దేవా ఇంటికి తీసుకెళ్తాడు.అతని బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేయించి మిధునతో తినిపిస్తాడు.తనకు మిధునతో తనకు పెళ్లి ఫిక్స్ అయిన సంగతి రిషి చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు.
ఇక రోడ్డుపై రిషిని, మిధునను చూసిన భానుమతి సంతోషం పట్టలేక డాన్స్ వేసుకుంటూ దేవా ఇంటికి వస్తుంది.వాళ్లందరూ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావని అడుగుతారు. ఈవిషయం నోటితో చెప్పలేనని...మీకే చూపిస్తానంటూ రిషితో మిధున కలిసి ఉన్నప్పుడు తాను తీసుకున్న సెల్ఫీ ఫొటోను వారికిచూపుతుంది. వాళ్లంతా ఎవరు ఇతను అని అడుగుతారు. రిషి మిధునకు కాబాయే భర్త అని ఆమె సంతోషంతో వారికి చెబుతుంది. కానీ ఆమె మాటలు వారు నమ్మరు. దీనికి భాను కూడా సమాధానమిస్తుంది. వేరే ఎవరైనా చెబితే నేను నమ్మేదాన్ని కానని....స్వయంగా రిషినే ఈమాట చెప్పాడని చెబుతుంది. తను మా మేనమామ కుమార్తె అని...మా పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందని చెబుతాడు. దీనికి మిధున కూడా ఒప్పుకుందని చెప్పింది. ఆ మాట రిషి చెబుతుంటే పక్కనే మిధున ఉండి కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పింది.
రిషి మిధునను తీసుకుని పార్క్‌కు వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడిగితే...సరదాగా గడుపుదామని తీసుకొచ్చానని చెబుతాడు. ఇద్దరూ కలిసి ఒక బెంచ్‌మీద కూర్చుని ఉండగా....మిధున గతం తాలుకా జ్ఞాపకాలతో చాలా మూడీ ఉండటం గమనించి...రిషి కలుగజేసుకుని మాట్లాడతాడు. యాక్సిడెంటల్‌గా జరిగిన విషయాలను మర్చిపోయి...కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచిస్తాడు. వాటినే తలచుకుని కుమిలిపోకూడదని సలహా ఇస్తాడు. నీ మెడలో అతను కట్టిన తాళి కూడా ఓ విధంగా యాక్సిడెంట్‌లాంటిదే అంటాడు. ఇంకా ఆ విషయం గురించి బాధపడొద్దంటాడు. ఎలాగైనా మిధునను ఆ మూడ్‌లోనుంచి బయటకు తీసుకొచ్చి నవ్వించాలని ప్రయత్నిస్తుంటాడు రిషి. జోకర్ వేషం వేసి ఆమె నవ్వేలా చేస్తాడు.
ఇంతలో మిధునకు తండ్రి కాల్‌చేసి మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నారని అడగ్గా పార్కుకు వచ్చామని చెబుతుంది. రిషి చాలా ఇంట్రోవర్ట్ ఎవరితో అంతగా కలవలేడని చెప్పగా....మిధున పెద్దగా నవ్వుతూ అతను చాలా జోవియల్‌గా ఉన్నాడని...మాట్లాడుతూనే ఉన్నాడని చెప్పడంతో తండ్రి చాలా సంతోషిస్తాడు. చాలా రోజుల తర్వాత నువ్వు నవ్వుతూ మాట్లాడవని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇదే విషయాన్ని భార్య లలితను పిలిచి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా రిషి పరిచయం వల్లేనని ఆనందపడతాడు. చాలా రోజుల నా కూతరు నవ్వడం విన్నానని ఆమెతో చెబుతాడు. ఆ దేవా తాళికట్టిన తర్వాత వాడే జీవితమని కష్టాలను కొని తెచ్చుకుని మిధున సంతోషాలకు దూరమైందని...మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు సంతోషంగా ఉందని అంటాడు.
దేవా ఇంట్లోని నరకం నుంచి మిధున ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని నేను దేవుడిని వేడుకోని రోజు లేదని...ఇన్నాళ్లకు దేవుడు నా మొర ఆలకించాడని భార్యతో అంటాడు. రిషి కూడా మిధున గతాన్ని మరిచిపోయేలా చేస్తున్నాడని చెబుతాడు. తన మనసుకు కలిగిన గాయం మానిపోయేలా చేస్తున్నాడంటాడు.మనం ఒకప్పుడి మిధునను చూస్తామన్న నమ్మకం ఉందని అంటాడు. దేవా పెట్టిన కష్టాలతో వచ్చిన కన్నీళ్లను రిషి ఆనందబాష్పాలుగా మారుస్తాడని లలిత కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది.





















