అన్వేషించండి
Advertisement
NTR Jr: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్...
ఎన్టీఆర్ జూనియర్ రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే... 'వస్తున్నారు' అని చెప్పాలి. అయితే... అది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! రియల్ లైఫ్‌లో రాజకీయాలకు ఎన్టీఆర్ దూరం అనే సంగతి తెలిసిందే. ఆ మధ్య 'ఆర్ఆర్ఆర్' ప్రెస్‌మీట్‌లో 'ఏపీలో టికెట్ రేట్స్ వెసులుబాటు విషయంలో ఎన్టీఆర్ సహాయ సహకారాలు తీసుకుంటారా?' అని నిర్మాత డీవీవీ దానయ్యను ప్రశ్నించినా... పక్కన ఉన్న ఎన్టీఆర్ స్పందించలేదు. అయితే... రీల్ లైఫ్‌లో మాత్రం ఆయన రాజకీయాలకు రెడీ అన్నారు.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయిన సంగతి తెలిసిందే. హీరోగా ఆయన 30వ సినిమా (NTR30) ఇది. ఇందులో ఆయన స్టూడెంట్‌గా కనిపించనున్నారు. ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే... స్టూడెంట్ అనేది కాదు. బస్తీలో చదువుకునే ఓ స్టూడెంట్, అదే బస్తీలో పేద విద్యార్థుల హక్కుల కోసం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేశాడు? ప్రభుత్వాన్ని ఎలా ఢీ కొన్నాడు? అనేది కథ (NTR30 Story Line) అని తెలుస్తోంది. రాజకీయాలు, రాజకీయ నాయకులతో ఓ విద్యార్థి చేసే పోరాటం మీద సినిమా ఉంటుందని సమాచారం.
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో వచ్చిన 'జనతా గ్యారేజ్'లో కూడా ప్రభుత్వ ప్రస్తావన ఉంటుంది. అయితే... అందులో ఎక్కువ ప్రకృతి, పేద ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టారు. ఈసారి పేదల విద్య గురించి సందేశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. సందేశాత్మక కథలకు కమర్షియల్ హంగులు అద్దడంతో కొరటాల శివది అందెవేసిన చేయి. ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే కమర్షియల్ హంగులు ఉండేలా కథ రెడీ చేశారట.
ఫిబ్రవరి 18న హైదరాబాద్ లో ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవానికి (NTR30 Launch) ఏర్పాట్లు చేశారు. ఆ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు. అందులో రామ్ చరణ్ జోడీగా ఆమె కనిపించనున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా మాత్రం ఇదే. అయితే... ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎన్టీఆర్ సోదరు డు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement