News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NTR’s AI-Illusion Images: ‘దేవర‘ నుంచి అదిరిపోయే ఫోటోలు విడుదల, వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ నుంచి రెండు కొత్త ఫోటోలు విడుదలయ్యాయి. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ షేర్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల ప్రత్యేకత ఏంటంటే?

FOLLOW US: 
Share:

‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.  

‘దేవర’ మూవీ నుంచి రెండు ఫోటోలు విడుదల

‘దేవర’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. ఇక మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి లీకులకు తావులేకుండా చూసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు ఫోటోలు విడుదల అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

AI-ఫోటోలు షేర్ చేసిన శ్రీనివాస్ మోహన్

‘దేవర’ సినిమాకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ సూపర్‌ వైజర్ శ్రీనివాస్ మోహన్ రెండు ఫోటోలను ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. AI ఇల్యూషన్ టూల్ తో ఎన్టీఆర్ ముఖాన్ని ఇందులో సృష్టించారు. సముద్రం ఒడ్డున ఉన్న పడవలతో ఎన్టీఆర్ ఫేస్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ పిక్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.

‘కారంచేడు’ హత్యాకాండ ఆధారం రూపొందుతున్న ‘దేవర’?

ఇక ‘దేవర’ చిత్రాన్ని దళితులపై జరిగిన దారుణ హత్యాకాండ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడు విషాద ఘటనను దర్శకుడు ఇందులో చూపించనున్నట్లు సమాచారం. 1985లో ఆంధ్రప్రదేశ్ లోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనను ‘దేవర’ చిత్రంలో కొరటాల శివ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మామూలుగా కొరటాల శివ సినిమాలు అంటేనే ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం, లేదంటే ఏదైనా సామాజిక అంశాన్ని టచ్ చేస్తూ ఉంటారు.  అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ స్టోరీలోనూ కారంచేడు విషాద ఘటన తాలూకు సీన్లు ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘దేవర’

ఇక దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సనసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘దేవర’ వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Sep 2023 01:30 PM (IST) Tags: Janhvi Kapoor Jr NTR Koratala Shiva Viral Pics Devara Movie NTR’s AI Illusion Images

ఇవి కూడా చూడండి

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?