Lust Stories 2: కాజోల్‌తో శృంగార సన్నివేశం, ఇబ్బంది కలిగించలేదు - ‘లస్ట్ స్టోరీస్ 2’పై కుముద్ మిశ్రా వ్యాఖ్యలు
‘లస్ట్ స్టోరీస్ 2’లో కాజోల్ తో కలిసి నటించడంపై నటుడు కుముద్ మిశ్రా ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆమెతో కలిసి ఈ సిరీస్ లో నటించడం ఎలాంటి ఇబ్బంది పడలేదన్నారు.
నటుడు కుముద్ మిశ్ర తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’. ఇందులో తను కాజోల్ తో కలిసి నటించారు. వీరి పార్ట్ కు అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. సహ నటి కాజోల్ నటనా నైపుణ్యం, ఆమెతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నట్లు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు.
ముందు ఆందోళన కలిగినా!
'లస్ట్ స్టోరీస్ 2'లో కుముద్ మిశ్రా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన కాజోల్ భర్తగా నటించారు. ఆమెను నిత్యం వేధించే దుర్మార్గపు భర్తగా కనిపించారు. కాజోల్ ను శారీరకంగా, మానసికంగా హింసిస్తూ కనిపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి స్పందించారు. ఈ వెబ్ సిరీస్ కు ఎందుకు ఓకే చెప్పాల్సి వచ్చిందో వివరించారు. బోల్డ్ సన్నివేశాల్లో నటించే సమయంలో కలిగిన ఇబ్బంది గురించి ప్రస్తావించారు. "ఈ సిరీస్ ప్రారంభంలో కొన్ని సన్నివేశాల గురించి, నేను నటిస్తున్న పాత్ర గురించి కాస్త ఆందోళన చెందాను. అసౌకర్యంగానూ ఫీలయ్యాను. కానీ, దర్శకుడు అమిత్ జీ చాలా మంచివాడు. ఎలాంటి ఇబ్బంది పడకుండా నటించేలా ప్రోత్సహించారు. ఆయన కారణంగానే మంచి రిజల్ట్ వచ్చింది” అన్నారు.
కాజోల్ గురించి ఏమన్నారంటే?
ఇక సహ నటి కాజోల్ గురించి కుముద్ మిశ్రా పలు విషయాలు చెప్పారు. ఆమె నటన పట్ల ప్రశంసలు కురిపించారు. “కాజోల్ చాలా సంవత్సరాలుగా అద్భుత నటన కనబరుస్తోంది. పాత్రకు తగినట్లుగా ఇట్టే ఒదిగిపోతుంది. ఈ సిరీస్ షూటింగ్ సందర్భంలో సన్నిహిత సన్నివేశాల్లో నటించినా ఏకరమైన ఇబ్బంది కలగలేదు. షూటింగ్ తొలి రోజునే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ కారణంగా నటనలో చాలా సౌకర్యంగా ఫీలయ్యాం” అని చెప్పారు.
నాలుగు కథలతో 'లస్ట్ స్టోరీస్ 2'
ఈ ‘లస్ట్ స్టోరీస్’ అనేది ఓ భిన్నమైన పాత్రల ఆంధాలజీ. తొలి పార్ట్ లాగానే రెండో పార్ట్ ను కూడా తీర్చిదిద్దారు మేకర్స్. అయితే మొదటి సీజన్ లో కియారా అద్వానీ, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్, తదితరులు నటించారు. కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ ఒక్కో ఎపిసోడ్ కు ఎపిసోడ్ కు దర్శకత్వం వహించారు.‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు. 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ ని సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ నలుగురు దర్శకులు తెరకెక్కించారు. తమన్నా, మృనాల్ ఠాకూర్ విజయ్ వర్మ, అమృతా సుభాష్, అంగద్ బేడీ,కాజోల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, తిలోత్తమా షోమే నటించారు. జూన్ 29న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: మరి దీన్ని ఏమంటారు సమంతా? ‘ఖుషీ’లోని ఆ సీన్‌పై ట్రోలింగ్ - సామ్ ఓల్డ్ ట్వీట్ వైరల్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial