అన్వేషించండి

Samantha Kushi poster: మరి దీన్ని ఏమంటారు సమంతా? ‘ఖుషీ’లోని ఆ సీన్‌పై ట్రోలింగ్ - సామ్ ఓల్డ్ ట్వీట్ వైరల్!

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా నుంచి తాజాగా ‘ఆరాధ్య’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను చూసి నెటిజన్లు సమంతను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'.  డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.

సమంతకు కొత్త పాట తలనొప్పులు

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆరాధ్య’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్, సమంత కెమిస్ట్రీ బాగా పండింది. పిక్చరైజేషన్, లిరిక్స్, ట్యూన్స్ చాలా బాగున్నాయి.  ఇప్పటికే 'నా రోజా నువ్వే' పాటకు మంచి స్పందన రాగా, ఈ పాట కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ పాటలోని ఓ సీన్ సమంతకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గతంలో ఆమె చేసిన ఓ ట్వీట్ కు ఈ పాటలోని ఓ పోస్టర్ కు లింకు పెడుతూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.    

సమంతపై ట్రోలింగ్ ఎందుకు?

'ఆరాధ్య' అంటూ ‘ఖుషి’ సినిమా నుంచి వచ్చిన ఈ పాటలో ఓ చోట సమంత కుడి చేతిని విజయ్ దేవరకొండ కాలితో తన్నే ఒక సీన్ ఉంది. ఆ సీన్‌ను బేస్ చేసుకుని కొందరు నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సమంత గతంలో ఓ సినిమాపై చేసిన ట్వీట్ ని బయటకు తీశారు. అందులో.. “ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి” అని రాసుకొచ్చింది. అయితే అది 'వన్- నేనొక్కడినే' పోస్టర్. అందులో మహేష్ కాళ్ల దగ్గర హీరోయిన్ ఉన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు ఆ ఫొటోని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఖర్మ ఫలితం అంటే ఇలాగే ఉంటుంది అంటూ నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు.
Samantha Kushi poster: మరి దీన్ని ఏమంటారు సమంతా? ‘ఖుషీ’లోని ఆ సీన్‌పై ట్రోలింగ్ - సామ్ ఓల్డ్ ట్వీట్ వైరల్!

‘ఖుషీ’ సినిమా సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన టైటిల్ పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. 

 

సినిమాలకు కొంత కాలం బ్రేక్

సమంత చేతిలో ప్రస్తుతం 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. ఈ రెండింటి షూటింగ్స్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై సమంత ఫుల్ ఫోకస్ పెట్టింది. ఆరు నెలల పాటు సినిమాలకు విరామం ఇచ్చి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవాలని భావిస్తోంది.

Read Also: నానీని ‘హాయ్ నాన్న’ అని పలకరిస్తోన్న మృణాల్ ఠాకూర్ - నేచురల్ స్టార్ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget