Nithya Menen: నిత్యా మీనన్ ప్రెగ్నెంట్? ఆమె ఇన్‌స్టా పోస్ట్ చూసి జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!
నిత్యామీనన్ స్వయంగా తను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
అప్పటివరకు మలయాళ చిత్రాల్లో నటించిన నిత్యామీనన్(Nithya Menen) 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఇలా ఎన్నో హిట్టు సినిమాల్లో నటించింది. మెయిన్ లీడ్ కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్'(BheemlaNayak) సినిమాలో కనిపించింది.
అలానే 'ఇండియన్ ఐడల్ తెలుగు' షోకి జడ్జిగా వ్యవహరించింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. రీసెంట్ గా 'తిరు' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఓ మలయాళ హీరోని ఆమె పెళ్లాడబోతున్నట్లు కథనాలు ప్రసారం కాగా.. నిత్యామీనన్ నేరుగా స్పందించింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు నిత్యామీనన్ స్వయంగా తను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తనకు ప్రెగ్నన్సీ పాజిటివ్ వచ్చినట్లుగా కిట్ ను షేర్ చేసింది. దీనికి 'ది వండర్ బిగిన్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నిత్యామీనన్ నిజంగానే ప్రెగ్నెంటా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా ప్రమోషన్స్ కోసం ఈ పోస్ట్ పెట్టి ఉంటుందని అంటున్నారు. బహుశా.. నిత్యామీనన్ తన నెక్స్ట్ ఫిల్మ్ లో గర్భవతిగా కనిపిస్తుందేమో. దీనికి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
View this post on Instagram
నిత్యాకు వేధింపులు:
సినిమాల సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా నిత్యామీనన్ తననొక వ్యక్తి వేధిస్తున్నట్లు చెప్పింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి తనను వేధించినట్లు తెలిపింది నిత్యా. సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశాడని.. ఆరేళ్లపాటు తనను అన్‌పాపులర్ చేయడానికి ప్రయత్నించాడని నిత్యామీనన్ తెలిపింది. దాదాపు 30 వేర్వేరు నెంబర్స్ నుంచి ఫోన్లు చేస్తూ వేధించేవాడని.. అన్ని నెంబర్స్ ను బ్లాక్ చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తన పేరెంట్స్ అండగా నిలబడ్డారని.. అతడిని గట్టిగా హెచ్చరించామని తెలిపింది. చాలా మంది అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినట్లు.. కానీ క్షమించి వదిలేశానని చెప్పుకొచ్చింది.
Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?