Nithiin Robinhood: రామ్ చరణ్ డేట్‌కి వస్తున్న నితిన్ - ‘రాబిన్ హుడ్’ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!
Robinhood: నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Robinhood Release Date: హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నితిన్ సరసన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి... ‘రాబిన్ హుడ్’ డిసెంబర్‌లో...
‘రాబిన్ హుడ్’ సినిమాను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలోనే అధికారికంగా ప్రకటించారు. కానీ రామ్ చరణ్, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’ కూడా అదే రోజు విడుదల కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో ‘రాబిన్ హుడ్’ను తర్వాత ఎప్పుడైనా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కానీ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వెళ్లడంతో తిరిగి మొదట ప్రకటించిన తేదీకే ‘రాబిన్ హుడ్’ రానుంది.
దొంగగా మారనున్న నితిన్...
‘రాబిన్ హుడ్’లో నితిన్ దొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులు షూటింగ్ చేస్తే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. ఒకవేళ ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్ పోన్ అయితే డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని టీమ్ ముందే ఫిక్స్ అవ్వడంతో రిలాక్స్ అవ్వకుండా వర్క్ చేశారు. దీంతో చెప్పిన డేట్‌కు రావడం సులభం అవుతుంది.
Also Read: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
నితిన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్...
నితిన్ కెరీర్‌లోనే ‘రాబిన్ హుడ్’ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దాదాపు రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. 2023 డిసెంబర్‌లో నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదల అయింది. సంవత్సరం గ్యాప్ తర్వాత నితిన్ మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మరోవైపు ‘తమ్ముడు’ కూడా...
నితిన్ హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరికి వచ్చింది. అయితే రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా లాక్ చేయలేదు. 2025 ఫిబ్రవరి లేదా సమ్మర్‌లో ‘తమ్ముడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
Team #Robinhood wishes you all a very Happy Dasara ✨
— Mythri Movie Makers (@MythriOfficial) October 12, 2024
May this festival be vibrant and full of joy ❤🔥
The entertaining adventure in cinemas from December 20th 💥@actor_nithiin @sreeleela14 @venkykudumula @gvprakash @MythriOfficial pic.twitter.com/nrgEmQnFjf