By: ABP Desam | Updated at : 01 Aug 2022 02:48 PM (IST)
నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ లో యంగ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. 'హ్యాపీడేస్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా 'కార్తికేయ2' ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు రిలీజ్ డేట్స్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఆగస్టు 12న ఫిక్స్ చేశారు. అయితే ఈ డేట్ కూడా అంత ఈజీగా దొరకలేదట.
ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా వెల్లడించారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. రిలీజ్ డేట్స్ విషయంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సినిమాలను అటు ఇటు పుష్ చేస్తారంట కదా.. అది మా సినిమా విషయంలో కూడా జరిగిందని అన్నారు. ఆగస్టు 12న 'కార్తికేయ2' సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసినప్పుడు అది కూడా వద్దన్నారని నిఖిల్ గుర్తు చేసుకున్నారు.
'అక్టోబర్ లేదా నవంబర్ కు వెళ్లిపోండి.. మీ సినిమాకు థియేటర్స్ దొరకవు. ఇప్పుడిప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు' అని అన్నారని.. ఆ రోజు చాలా ఏడ్చానని చెప్పుకొచ్చారు నిఖిల్. 'హ్యాపీడేస్' సినిమా నుంచి తన సినిమా రిలీజ్ కాదని.. థియేటర్స్ దొరకవని ఎప్పుడూ అనిపించలేదని అన్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడతామని.. ఎంత కష్టపడ్డా.. నీ సినిమా రిలీజ్ అవ్వదన్నప్పుడు బాధేసిందని చెప్పుకొచ్చారు.
అయితే చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్, అభిషేక్ పట్టుబట్టి ఆగస్టు 12న వస్తున్నామని అనౌన్స్ చేశారని.. ఆ రోజున తమ సినిమాకి థియేటర్స్ దొరుకుతాయని అనుకుంటున్నానని అన్నారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు వస్తే థియేటర్స్ అండ్ ఓపెనింగ్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుందని.. కానీ డేట్ లేనప్పుడు ఎక్కడో ఒక చోట క్లాష్ అవ్వాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాలని తెలిపారు నిఖిల్.
Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి
Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్తో మెగా హీరో నిశ్చితార్థం!
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!
Salman Khan: వైజాగ్ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు
Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Bihar: బిహార్లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?