Neetu Kapoor New Car: రూ.3 కోట్లతో బెంజ్ కారు కొనుగోలు చేసిన ప్రముఖ హీరో తల్లి
నీతూ కపూర్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. విలాసవంతమైన జర్మన్ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ తయారు చేసిన Maybach GLS600 తన గ్యారేజీలోకి తెచ్చుకుంది. ఈ కారు ధర చూసి అందరూ అశ్చర్యపోతున్నారు.
సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం కామన్ అయినా, అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తాయి. తాజాగా రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అత్యంత విలాసవంతమైన కార్లను తయారు చేయడంలో పేరొందిన బెంజ్ కంపెనీకి చెందిన మేబ్యాచ్ GLS600 కీస్ అందుకుంది. ఈ కారు ధర రూ. 3 కోట్లు. అత్యంత విలాసవంతమైన ఈ కారు దేశంలో కొద్ది మంది దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో నీతూ కపూర్ చేరిపోయింది. ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా ఇండియాలోకి ఇంపోర్టు అవుతుంది. అందుకే లిమిటెడ్ ఎడిషన్ మాత్రం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. తాజా ఈ కారును కొనుగోలు చేసిన ఆమె, లగ్జరీ వాహనం ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. బెంజ్ కంపెనీ పోస్టు చేసిన ఈ ఫోటోలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మల్టిఫుల్ కలర్స్, పవర్ ఫుల్ ఇంజిన్
ఇక లేటెస్ట్ మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ సహా పలు రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యాధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్లుతో రూపొందింది. మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్‌ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 21 బిహెచ్‌పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జనరేటర్‌ను కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కు యాడ్ చేయబడి ఉంటుంది.
4.6 సెకెన్లలో 100 కిలో మీటర్ల వేగం
మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్‌ఎస్600 ఎస్‌యూవీ కారు కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. సేఫ్టీ ఫీచర్స్ విషయంలో కంపెనీ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణాలకు ముప్పు కలగకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
View this post on Instagram
Read Also: సారా కాదు రష్మిక - అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్న శుభ్‌మాన్ గిల్