By: ABP Desam | Updated at : 24 Feb 2023 05:08 PM (IST)
Edited By: Raj
Image Credit: Srinivasa Avasarala/Instagram
'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలు సెలెక్ట్ చేస్తుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాని ఈరోజు తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ, పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
ఇకపోతే నాని 'నిజం విత్ స్మిత' అనే టాక్ షోకి దగ్గుబాటి రానాతో కలిసి సెలబ్రిటీ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈరోజు నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సినిమా సంగతులే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో డెబ్యూ మూవీ 'అష్టా చమ్మా' లో హీరోగా నటించే అవకాశం ఎలా వచ్చిందో వెల్లడించారు.
నాని మాట్లాడుతూ.. ''అష్టా చమ్మా సినిమా అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని. నేను స్క్రిప్ట్‌లు రాసేవాడిని. నేను రాసిన ఒక ఐడియాని నేనే యాక్ట్ చేసి చూపించాల్సి వచ్చింది. ఆ అబ్బాయి బాగా చేయలేకపోవడంతో ఆ యాడ్ నాతో చేయించారు. ఆ యాడ్ ఎడిటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే మోహన్ కృష్ణ గారి 'అష్టా చమ్మా' మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను బాగున్నానని భావించి శ్రీనివాస్ అవసరాల చేసిన రోల్ కి నన్ను అడిగారు'' అని చెప్పారు.
''ఒకరోజు మా అమ్మతో నాకు సినిమా ఆఫర్ చేశారని, యాక్ట్ చేయమని అడిగారని నేను చెప్పినప్పుడు, ఆమె పేస్ లో ఒక వెలుగు చూశా. ఎంతో ఎగ్జైటింగ్ గా 'అంటే పెద్ద స్క్రీన్ మీద కనపడతావా?' అని అడిగింది. ఆమె అంత ఉత్సాహంగా అడిగే సరికి, ఒక సినిమాలో కనిపిద్దాం అని అనుకున్నాను. 2008లో ఎలా ఉన్నానో 2030లో చూసుకోవాలనిపిస్తే ఎక్కడో చోట ఒక సినిమాలో ఉంటే చూసుకోవచ్చు కదా (నవ్వుతూ). ఆ ప్రాసెస్ లో నన్ను హీరోగా షిఫ్ట్ చేశారు. ప్రతి రోజూ 'నువ్వు ఒక స్టార్ మెటీరియల్' అని మోహన్ కృష్ణ గారితో సహా అందరూ అంటుంటే, 'ఏంటి.. నిజమా' అని అప్పటివరకు లేని తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేది. సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ బాగా నచ్చింది. రివ్యూలు బాగా వచ్చాయి. ఈ కుర్రాడు ఎవరు అని అందరూ మెచ్చుకున్నారు'' అని నాని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే స్మిత షోలో నాని సోదరి దీప్తి ఘంటా కూడా వీడియో ద్వారా మాట్లాడింది. “నానికి సినిమా పిచ్చి చిన్నప్పుడే స్టార్ట్ అయింది. మాది చిన్న ఇల్లు పెద్ద ఫ్యామిలీ. ఇల్లు ఎప్పుడూ బంధువులతో, స్నేహితులతో నిండి ఉంటుంది. నానికి ఎప్పుడూ చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అతనికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలే. వీకెండ్ లో సినిమాలు చూడటం.. ఆ వీక్ అంతా సినిమాల గురించి మాట్లాడేవాడు.. వాటి గురించే ఆలోచించేవాడు. అప్పటి నుంచే వాడికి హీరో అవ్వాలని బాగా కోరిక ఉండేది. చిన్నప్పుడు హీరో అవుతానని అనేవాడు. కానీ రియాలిటీ తెలుసుకున్న తర్వాత డైరెక్టర్ అవుతా అని చెప్పడం మొదలుపెట్టాడు. నేను కానీ, మా కుటుంబం కానీ వాడిని ఎంకరేజ్ చేయలేదు. ఈ ఫీల్డ్ లో బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ సాధించడం కష్టమని చెప్పలేదు'' అని పేర్కొన్నారు.
''కానీ సినిమా పట్ల అతని కష్టం, అంకితభావం చూసి చివరికి ఇదే అతని కెరీర్ మంచింది అని మాకు అనిపించింది. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా వాడు సంతోషంగా ఉండడు. 20 ఏళ్ల తర్వాత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, నాని ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని జనాలు అనుకోవచ్చు. కానీ మీకు విషయం ఏమిటంటే, రాబోయే 20 ఏళ్ళు కష్టపడినా నీకు సక్సెస్ రాదని చెప్పినప్పటికీ, నాని అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేదా స్పాట్ బాయ్ గానో తన జీవితమంతా సినిమాకి సంబంధించిన ఏదైనా పని చేస్తూనే ఉండేవాడు” అని నాని గురించి దీప్తి చెప్పుకొచ్చింది.
Read Also: ‘సలార్’కు శృతిహాసన్ గుడ్ బై - ఆధ్య ఎమోషనల్ పోస్టు
Jaya Janaki Nayaka Hindi Dubbed: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రపతి’ రిమేక్ చేస్తున్నారా?
Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?
Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి