Nandamuri Kalyan Ram : విడుదలకు ముందే లాభాల్లోకి కళ్యాణ్ రామ్ 'అమిగోస్'
Amigos Telugu Movie : నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా 'అమిగోస్' విడుదలకు ముందు లాభాలు తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాల ఖబర్.
బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన హీరో నుంచి కొత్త సినిమా వస్తుంటే... ఆ సినిమాకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. బిజినెస్ ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కొత్త సినిమా 'అమిగోస్'కు ఆ విధంగా జరుగుతుంది. విడుదలకు ముందే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది.
తెలుగు చిత్రసీమలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేసే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. రిస్క్ చేశారు కాబట్టే 'బింబిసార' లాంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ సినిమా సక్సెస్, దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ బ్రాండ్ వేల్యూ... ఇప్పుడు 'అమిగోస్'కు హెల్ప్ అవుతున్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూచించే పదం. ఈ సినిమాలో హీరో ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు... ముగ్గురు హీరోల మధ్య స్నేహాన్ని వివరించే 'యెక యెక...' పాటకు మంచి స్పందన లభిస్తోంది. దాంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని సమాచారం.
బడ్జెట్ అంతా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో
ఆల్రెడీ 'అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ నుంచి వచ్చేది అంతా లాభమే.
Also Read : చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'నాటు నాటు' - ఆస్కార్ నామినేషన్ వచ్చిందోచ్
మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్... 'అమిగోస్'లో రూపురేఖల పరంగా ఒకేలా కనిపించే ముగ్గురు వ్యక్తులుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తారు. వాళ్ళ మధ్య స్నేహాన్ని ఆవిష్కరించే 'యెక యెక...' పాటను తాజాగా విడుదల చేశారు. అందులో ముగ్గురి క్యారెక్టరైజేషన్లు కూడా కొంచెం చూపించారు. బీచ్ ఏరియాలో మాంచి స్టైలిష్, కలర్ ఫుల్ అమ్మాయిల మధ్య పాటను చిత్రీకరించారు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ యాక్షన్ మాత్రమే కాదు... నటుడు బ్రహ్మాజీ కూడా పాటలో ఉన్నారు.
Also Read : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?
జిబ్రాన్ సంగీతంలో 'యెక యెక...' పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. అనురాగ్ కులకర్ణి పాటను ఆలపించారు. దివంగత గేయ రచయిత వేటూరి రాసిన పాట సినిమాలో ఉందని, త్వరలో ఆ పాటను కూడా విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.
కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ!
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు!
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.