Balakrishna As Reddy Garu : 'రెడ్డి గారు'కు ఓటు వేసిన బాలకృష్ణ?
బాలకృష్ణ 107వ సినిమాకు టైటిల్ ఖరారు చేశారని, శనివారం ఆ టైటిల్ లోగో వెల్లడించనున్నారని సమాచారం.
![Balakrishna As Reddy Garu : 'రెడ్డి గారు'కు ఓటు వేసిన బాలకృష్ణ? Nandamuri Balakrishna's new movie NBK107 titled as Reddy Garu reports Balakrishna As Reddy Garu : 'రెడ్డి గారు'కు ఓటు వేసిన బాలకృష్ణ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/302d6cce69b7763b6a3206b8b588f3211665471709844313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 107వ సినిమాకు టైటిల్ ఖరారు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'అన్న గారు', 'జై బాలయ్య', 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
'రెడ్డి గారు'కు టైటిల్ ఖరారు చేసిన బాలయ్య?
'అఖండ' సినిమాలో 'జై బాలయ్య' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాటలో షర్ట్ విప్పే స్టెప్ అయితే విదేశీయులను సైతం ఆకట్టుకుంది. 'జై బాలయ్య' క్రేజ్ ఖండాంతరాలు దాటింది. అందుకని, 'జై బాలయ్య' ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చాలా మంది భావించారు. సినిమా యూనిట్ కూడా ఆ పేరుతో టైటిల్ లోగో డిజైన్ చేయించిందట! దాంతో పాటు మరో ఆప్షన్‌గా 'రెడ్డి గారు' టైటిల్ లోగో డిజైన్ చేయించారు. రెండు టైటిల్స్‌లో 'రెడ్డి గారు' టైటిల్ (NBK107 Title) కు బాలకృష్ణ ఓటు వేయడంతో ఆ టైటిల్ ఖరారు చేశారట.
'రెడ్డి గారు' (Balakrishna's Reddy Garu Movie) టైటిల్ ఖరారు చేసినట్లు ఈ శనివారం అధికారికంగా ప్రకటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బాలయ్య క్యారెక్టరైజేషన్ ప్రతిబింబించేలా టైటిల్ లోగో డిజైన్ చేశారట.
టర్కీలో ఊర మాస్ ఫైట్!
ఇటీవల టర్కీలోని ఇస్తాంబుల్‌లో భారీ షెడ్యూల్ ముగించుకుని బాలకృష్ణ, ఎన్‌బీకే 107 చిత్ర బృందం ఇండియా తిరిగొచ్చింది. ఆ షెడ్యూల్‌లో రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో భారీ ఊర మాస్ ఫైట్ తీశారు. ఆ వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. బాలకృష్ణ కట్టి పట్టుకుని ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ ఫైట్ తీయడానికి ముందు... బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతీ హాసన్ (Shruti Hassan) మీద ఒక పాట తీశారు. దానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
వరలక్ష్మీ... హానీ రోజ్ కూడా!
శ్రుతీ హాసన్ కాకుండా NBK107లో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ (Honey Rose) ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Unstoppable With NBK S2 Episode 1 Promo : ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 'అన్‌స్టాపబుల్ 2' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఆ ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ సందడి చేయనున్నారు. బావ, అల్లుడితో బాలకృష్ణ సందడి చూడటం కోసం అందరూ వెయిటింగ్! 'అన్‌స్టాపబుల్ 2' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో (Unstoppable 2 First Episode Promo) ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల కానుంది.
Also Read : Sudheer Babu's Hunt Songs : నడుము సూత్తే పావుశేరే, బాడీలోన ఉందని ఫైరే - ఇది రొమాంటిక్ 'హంట్' సాంగ్ గురూ
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)