News
News
X

Sudheer Babu's Hunt Songs : నడుము సూత్తే పావుశేరే, బాడీలోన ఉందని ఫైరే - ఇది రొమాంటిక్ 'హంట్' సాంగ్ గురూ

Papa Tho Pailam Lyrical Video : 'హంట్'లో స్పెషల్ సాంగ్ 'పాపతో పైలం' నేడు విడుదల చేశారు. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, అప్సరా రాణిపై తెరకెక్కించిన ఈ పాటలో స్టెప్పులు, గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉన్నాయి.

FOLLOW US: 

నిట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటించించిన సినిమా 'హంట్' (Hunt Movie). హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ మాత్రమే కాదు... కిక్ ఇచ్చే రొమాంటిక్ గ్లామరస్ సాంగ్ ఒకటి కూడా ఉందండోయ్! 'క్రాక్', 'సీటీమార్' సినిమాల్లో ప్రత్యేక గీతాలతో సందడి చేసిన అప్సరా రాణి (Apsara Rani) ఈ పాటలో స్టెప్పులు వేశారు. 

పైలం పాపతో పైలం...
జర పైలం షేపుతో పైలం!
''సీటిగొట్టి సీటీగొట్టి మిట్ట మిట్ట సూత్తారే
సిట్టి పొట్టి బట్టలెత్తే సింపుకోని సత్తారే
నడుము సూత్తే పావుశేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్లచీర కట్టుకొని పెడితె ఎర్రబొట్టే
పదారేళ్ళ ఆంబులెన్సు టక్కరిచ్చినట్టే
ఆ... ఊ... ఏ... ఓ...
అడికినకిడి తకిడి తికిడి
పైలం పాపతో పైలం
జర పైలం షేపుతో పైలం
పైలం పాపతో పైలం
జర పైలం ఊపుతో పైలం'' అంటూ సాగిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యం అందించారు. 

'పాపతో పైలం...' పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా... మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు. తెలుగులో మంగ్లీ పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. 'పుష్ప'లో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' పాటతో పాటు కొన్ని హిట్ సాంగ్స్ నకాష్ అజీజ్ ఖాతాలో ఉన్నాయి. ఈ సాంగ్ కూడా హిట్ అయ్యేలా ఉంది. 

'పాపతో పైలం...' విజువల్స్ చూస్తే రిచ్‌గా, లావిష్‌గా ఉన్నాయి. పబ్‌లో సాంగ్ పిక్చరైజ్ చేశారు. నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదని తెలుస్తోంది. సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా పాటలో సందడి చేశారు. 

News Reels

చిత్రనిర్మాత వి. ఆనంద ప్రసాద్ (V Ananda Prasad) మాట్లాడుతూ "మా 'హంట్' సినిమాలో రెండు పాటలున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 'పాపతో పైలం' పాటకు మంచి స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు ఎనర్జీగా, స్టైలుగా డ్యాన్స్ చేశారని, సాంగ్ బావుందని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.

Also Read : Unstoppable 2 First Episode : చంద్రబాబుతో బాలకృష్ణ - 'అన్‌స్టాప‌బుల్‌ 2'కు ఫ్యామిలీ & పొలిటికల్ టచ్

'హంట్' సినిమాలో సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేస్తున్నారు. టీజర్ చూస్తే... సుధీర్ బాబు తన గతం మర్చిపోయాడని తెలుస్తుంది. గతం మరువక ముందు అతడు స్టార్ట్ చేసిన కేస్ ఏమిటి? దాన్ని మళ్ళీ అతడే క్లోజ్ చేయాలని శ్రీకాంత్ ఎందుకు చెబుతున్నారు? అనేది ఆసక్తిగా మారింది. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని స్పృశిస్తూ... పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు మహేష్ తెలిపారు. కొన్ని యాక్షన్ సీక్వెన్సులను ఫ్రాన్స్‌లో అక్కడి స్టంట్ డైరెక్టర్స్‌తో తీశామని ఆయన పేర్కొన్నారు.    

Also Read : Prabhas Adipurush Court Case : ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ - హీరోతో పాటు 'ఆదిపురుష్' యూనిట్‌కు నోటీసులు

Published at : 11 Oct 2022 10:51 AM (IST) Tags: Sudheer Babu Apsara Rani Papa Tho Pailam Song Hunt Movie Song Hunt Movie Updates Papa Tho Pailam Lyrical Video

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!