Balakrishna Son Birthday : ఫారిన్‌లో, షూటింగ్ లొకేషన్‌లో అబ్బాయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ
Mokshagna Teja : నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజును ఫారిన్‌లో, అదీ సినిమా షూటింగ్ లొకేషన్‌లో సెలబ్రేట్ చేశారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టర్కీలో ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా (NBK107 Movie) షూటింగ్ చేస్తున్నారు. తనతో పాటు కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja)ను కూడా తీసుకు వెళ్లారు. అక్కడ అబ్బాయికి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Balakrishna Son Birthday Celebrations : ఈ రోజు (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ తేజ్ పుట్టినరోజు. ఎన్‌బికె 107 షూటింగ్ లొకేషన్‌లో అబ్బాయి చేత కేక్ కట్ చేయించారు బాలకృష్ణ. ఆ తర్వాత కుమారుడికి ఆప్యాయంగా తినిపించారు. నటుడు సప్తగిరి తదితరులు కూడా టర్కీలోని ఇస్తాంబుల్ సిటీలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తండ్రి అడుగుజాడల్లో... మోక్షజ్ఞ?
ఎన్టీఆర్ మనవడు, బాలకృష్ణ వారసుడు అయిన మోక్షజ్ఞ కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే... తనయుడి వెండితెర ప్రవేశం గురించి బాలకృష్ణ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే... ఇటీవల బాలకృష్ణతో మోక్షజ్ఞ ఎక్కువగా కనిపిస్తున్నారు. నందమూరి కుటుంబానికి కళ్యాణ్ రామ్ 'బింబిసార' స్పెషల్ షో వేశారు. అక్కడ బాలకృష్ణ, మోక్షజ్ఞ కలిసి రావడం... కారులో దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తండ్రీ తనయుల రాక అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు టర్కీలో కూడా తండ్రీ తనయులు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్
NBK107 సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. టర్కీ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పది పదిహేను రోజులు ఫారిన్ షెడ్యూల్ ఉంటుందట.
Also Read : 'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమాకు ఈ నెగిటివ్ టాక్ ఏంటి?
శ్రుతీ హాసన్ కాకుండా సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు' (Balakrishna Annagaru Movie), 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ నటిస్తున్నారు. ఆయనది విలన్ రోల్. ఇంకా మలయాళ నటుడు లాల్, యువ హీరో నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.