అన్వేషించండి

Naa Saami Ranga: సంక్రాంతి సినిమాల్లో తక్కువ బిజినెస్ నాగార్జున సినిమాకే - 'నా సామి రంగ' రైట్స్ ఎన్ని కోట్లంటే?

Naa Saami Ranga break even target: అక్కినేని నాగార్జున 'నా సామి రంగ' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారు? అనేది ఒక్కసారి చూస్తే...

Nagarjuna's Naa Saami Ranga area wise distribution rights details: సంక్రాంతి బరిలో అందరి కంటే ఆలస్యంగా థియేటర్లలోకి వస్తున్న కథానాయకుడిగా కింగ్ అక్కినేని నాగార్జున. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'నా సామి రంగ'. ఈ ఆదివారం (జనవరి 14న) థియేటర్లలోకి వస్తుందీ సినిమా. సంక్రాంతి సినిమాల్లో అన్నిటి కంటే లోయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ సినిమాకు జరిగింది. ఎన్ని కోట్లకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు? ఏ ఏరియా రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయి? లాభాలు రావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? అనేది చూస్తే...

'నా సామి రంగ' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ జస్ట్ 18.5 కోట్లకు ఇచ్చేశారు 'నా సామి రంగ' మేకర్స్! ఏరియాల వారీగా చూస్తే... 

  • నైజాం (తెలంగాణ) - రూ. 5 కోట్లు
  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 2.5కోట్లు
  • ఆంధ్ర (అన్ని ఏరియాలు కలిపి) - రూ. 8 కోట్లు
  • ఏపీ, టీజీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 15.50కోట్లు
  • కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 1 కోటి
  • ఓవర్సీస్ - రూ. 2 కోట్లు
  • టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 18.50 కోట్లు

Also Read'గుంటూరు కారం'తో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్స్ దుమ్ము దులిపిన మహేష్... ఏ ఏరియా ఎన్ని కోట్లకు అమ్మారు? మహేష్ లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగింది?

థియేట్రికల్ రైట్స్ ద్వారా జస్ట్ 18.5 కోట్లు మాత్రమే వచ్చినప్పటికీ... డిజిటల్ అండ్ శాటిలైట్స్ ద్వారా నిర్మాతకు సుమారు 33 కోట్లు వచ్చాయి. దాంతో బడ్జెట్ రికవరీ కావడం కష్టం కాలేదు. డిజిటల్ రైట్స్ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ కావడంతో డీల్ వెంటనే క్లోజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో పోటీ ఉండటంతో తక్కువ రేటుకు రైట్స్ ఇవ్వమని నిర్మాత శ్రీనివాస చిట్టూరికి నాగార్జున చెప్పారట.

Also Read: డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'సైంధవ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి - ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతికి 'నా సామి రంగ'
'నా సామి రంగ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ తీసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ వేరొకరికి ఇచ్చారట. మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు సుమారు 32 కోట్ల రూపాయలు వచ్చాయని టాక్. 

Also Readక్రేజ్ ఎక్కువ, బిజినెస్ తక్కువే - 'హనుమాన్'ను ఎన్ని కోట్లకు అమ్మారంటే?

స్టార్ మా, డిస్నీతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. 'బిగ్ బాస్' రియాలిటీ షోను ఆయన హోస్ట్ చేస్తున్నారు. అది మంచి రేటింగ్స్ రాబడుతోంది. అంతకు ముందు మా టీవీని స్టార్ గ్రూప్ తీసుకోవడానికి ముందు ఆ ఛానల్ యజమానుల్లో నాగార్జున కూడా ఒకరనేది తెలిసిన విషయమే. ఆయన రంగంలోకి దిగడంతో 'నా సామి రంగ' ఓటీటీ, టీవీ రైట్స్ డీల్ ఈజీగా ఓకే అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget