Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా?
Nagarjuna Remuneration: నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ‘ సంక్రాంతి బరిలో దిగుతోంది. పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. తాజాగా ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న పారితోషికంపై చర్చ నడుస్తోంది.
![Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా? Nagarjuna is charging Rs 10 crores remuneration for Naa Saami Ranga Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/06/c59e0d84e8a0e620ec2433edbbb8ba7a1704519013689544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nagarjuna Remuneration For Naa Sami Ranga Movie: సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలకు మార్కెట్ కూడా బాగానే ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన, ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడ్డారు. ఆయన రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించడం లేదు. ప్రస్తుతం ఆయన ‘నా సామిరంగ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ గురించి చర్చ జరుగుతోంది.
‘నా సామిరంగ’ చిత్రానికి రూ. 10 కోట్ల రెమ్యునరేషన్
నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామిరంగ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున, తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా కొనసాగింది. నాగార్జున్ సెంటిమెంట్ ప్రకారం ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు? అనే విషయం బయటకు తెలిసింది. తాజా నివేదికల ప్రకారం ఆయన ఈ సినిమాకు రూ. 10 కోట్లు తీసుకున్నారు.
మిగతా సీనియర్ హీరోలతో పోల్చితే తక్కువే!
నిజానికి నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అయినా, రెమ్యునరేష్ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నారు. గత రెండు చిత్రాలకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు తీసుకున్న ఆయన ప్రస్తుతం తన రెమ్యునరేషన్ ను రూ. 10 కోట్లకు పెంచారు. అయినప్పటికీ, ఆయన తోటి సీనియర్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేష్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నారు. నందమూరి బాలయ్య ఇంచుమించు రూ.30 కోట్లు అందుకుంటున్నారు. వెంకటేష్ కూడా రూ. 10 కోట్లకు పైనే తీసుకుంటున్నారు. ఈ ముగ్గురు హీరోలతో పోల్చితే నాగార్జున చాలా వెనుకబడే ఉన్నారు.
నైజాం థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన నాగార్జున
అటు ‘నా సామిరంగ’ సినిమా నాన్ థ్రియేట్రిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయ్యాయి. ఈ హక్కులు రూ. 32 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా ఇప్పటికే అమ్ముడు అయ్యాయి. అయితే, నైజాం ఏరియా హక్కులను మాత్రం నాగార్జున తీసుకున్నారు. వీటిని ఆయన సుమారు రూ. 15 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు రెడీ అవుతోంది.
Read Also: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)