News
News
X

Telusa Manasa First Look : నాగార్జున హిట్ సాంగ్ టైటిల్‌గా వస్తున్న 'కేరింత' ఫేమ్ పార్వతీశం కొత్త సినిమా

పార్వతీశం, జశ్విక జంటగా శ్రీ బాలాజీ పిక్చర్స్ నిర్మించిన 'తెలుసా మనసా' సినిమా ఫస్ట్ లుక్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

ఎంఎం కీరవాణి (MM Keeravani) స్వరపరిచిన సూపర్ హిట్ పాటల్లో 'తెలుసా... మనసా' ఒకటి. ఆ పాట కింగ్ అక్కినేని నాగార్జున, మనీషా కొయిరాలా జంటగా నటించిన 'క్రిమినల్' సినిమాలోది. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సాంగ్ గురించి ఎందుకు? అంటే... ఆ పాటలో తొలి రెండు పదాలు ఓ సినిమాకు టైటిల్ మరి!

'కేరింత' ఫేమ్ పార్వతీశం (Parvateesam) కథానాయకుడిగా శ్రీబాలాజీ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమా 'తెలుసా మనసా' (Telusa Manasa Movie).  ఈ చిత్రంలో జశ్విక కథానాయిక. దీనికి వైభ‌వ్ ద‌ర్శ‌కుడు. వ‌ర్షా ముందాడ‌, మాధ‌వి నిర్మాతలు. పల్లెటూరి నేపథ్యంలో సరికొత్త కథ, కథనాలతో న్యూ ఏజ్ ప్రేమ కథగా తెరకెక్కించారు. ప్రముఖ అగ్ర నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) చేతుల మీదుగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. 

బెలూన్స్ అమ్ముకునే అబ్బాయిగా హీరో!
'తెలుసా మనసా' సినిమాలో ఒక పల్లెటూరిలో బెలూన్స్ (బుడగలు) అమ్ముకునే ఓ యువ‌కుడు మల్లి బాబుగా హీరో పార్వ‌తీశం కనిపించనున్నారు. ఆ ఊరిలో ప‌ని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత పాత్ర హీరోయిన్ జ‌శ్విక‌ది. ఇద్ద‌రి మనసుల్లోనూ ఒకరు అంటే మరొకరికి ప్రేమ ఉంటుంది. కానీ, ఎప్పుడూ వారిద్ద‌రూ ఆ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోరు. సుజాతకు ప్రపోజ్ చేయాలని ప‌లు సంద‌ర్భాల్లో మల్లి బాబు ట్రై చేస్తాడు. అయితే, చెప్ప‌లేక‌పోతాడు. ఓ సందర్భం తర్వాత అనూహ్యంగా మ‌ల్లి బాబు క‌ల‌లు కూలిపోతాయి. సుజాత‌కు దూ కావాల్సి వ‌స్తుంది. మళ్ళీ వారిద్ద‌రూ క‌లుసుకున్నారా? లేదా? అనేది సినిమా కథ. 

Also Read  : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా? 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PARVATEESAM (@kerintha_parvateesam)

ఫస్ట్ లుక్‌లో బామ్మ కూడా!
'తెలుసా మనసా' ఫస్ట్ లుక్ చూస్తే... హీరో హీరోయిన్లతో పాటు ఓ బాబు, బామ్మ రోల్ చేసిన రోహిణి హ‌ట్టంగ‌డి కూడా ఉంటారు. ఆమె మంచంపై కూర్చుని ఉంటారు. బామ్మ ఒడిలో బాబు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ లుక్‌లో హీరో పార్వతీశం ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు అలా దిగాలుగా కూర్చుని ఉన్నారు? అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర  బృందం పేర్కొంది. కొత్త దర్శకుడు చక్కగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.

Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...   

మ‌హేష్ అచంట‌, అలీ రెజా, లావ‌ణ్య‌, మాస్ట‌ర్ అద్వితేజ్‌, వెంకీ, శివ‌, శోభ‌న్ త‌దిత‌రులు ఈ సినిమాలో ఇతర తారాగణం. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు గోపీ సుంద‌ర్ 'తెలుసా మనసా' చిత్రానికి స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ప్ర‌సాద్ ఈద‌ర, కూర్పు : పాపారావ్, పాట‌లు : వ‌న‌మాలి, కాస‌ర్ల శ్యామ్‌, శ్రేష్ట‌, గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్‌, శ్రీరామ‌చంద్ర‌, ర‌మ్య బెహ్ర‌, శ్రీకృష్ణ‌, మాళ‌విక‌, సుధాంశు, సహ నిర్మాత : గిరిధ‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌ :  నైనీష్య‌, సాత్విక్‌, నిర్మాత‌లు: వ‌ర్షా ముందాడ‌, మాధ‌వి, కథ - కథనం - మాటలు - దర్శకత్వం :  వైభ‌వ్‌.

Published at : 01 Feb 2023 03:37 PM (IST) Tags: Dil Raju Telusa Manasa Movie Parvateesam Jashvika

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !