అన్వేషించండి
Advertisement
Nagababu: సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని మా అన్నయ్య అనలేదు.. నాగబాబు కామెంట్స్
ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదని ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారని అన్నారు. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం కరెక్ట్ కాదని నరేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
దాసరి నారాయణరావు గారు చనిపోయిన తరువాత ఆ స్థానం అలాగే ఉండిపోయిందని.. దానికోసం చాలా మంది ప్రయత్నించినా ఎవరికీ దక్కలేదని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే అర్హత మోహన్ బాబు గారికే ఉందని.. దాసరి గారు బతికున్నా మోహన్ బాబుకే ఆ బాధ్యతలు ఇచ్చేవారని అన్నారు. అంతేకాదు.. ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదని ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారని అన్నారు. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం కరెక్ట్ కాదని నరేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
దీనిపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని.. మా అన్నయ్య ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఇతర వ్యక్తులు ఎవరైనా కష్టమనతూ ఇంటికి వస్తే ఆయన చేతనైనంత సాయం చేశారే తప్ప.. పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడూ అనలేదని.. ఆయనకు అంత అహంకారం లేదని నాగబాబు అన్నారు.
అలానే తన 'మా' ఎలెక్షన్స్ గురించి, తన రాజీనామా గురించి మాట్లాడారు. జనరల్ ఎలెక్షన్స్ లో ఎలాంటి కుట్రలు జరుగుతాయో.. అవన్నీ 'మా' ఎన్నికల్లో జరిగాయని అన్నారు. సభ్యుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడతామనే విషయాలతో ఎన్నికల్లో నిలబడతారని అన్నారు. ప్రాంతీయవాదం, కులంతో పాటు ప్రకాష్ రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకువచ్చి పర్సనల్ ఇమేజ్ కి ఇబ్బంది కలిగేలా ఎదుటిప్యానెల్ సభ్యులు ప్రవర్తించారని చెప్పారు. అతడికి సపోర్ట్ గా వారికి కౌంటర్ ఇచ్చానని తెలిపారు.
ఇన్నాళ్లు ఈ అసోసియేషన్ లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీలయ్యానని.. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉందని.. మంచి హృదయంతో వ్యవహరిస్తారనుకున్నానని.. కానీ ఎన్నికల తరువాత ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదని చెప్పుకొచ్చారు. అందుకే మనస్థాపంతో బయటకు వచ్చేశానని.. ఇకపై ఈ అసోసియేషన్ తో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అలానే మరో అసోసియేషన్ పెట్టే ఆలోచన తమ కుటుంబానికి లేదని స్పష్టం చేశారు.
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read: ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తిరుపతి
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion