అన్వేషించండి

Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!

Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ సినిమా ఫస్టాఫ్‌ను చూసినట్లు దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ రేంజ్‌లో ఉందని అన్నాడు.

Pushpa 2 First Half Review: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో ఉందని చెప్పాడు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నాడు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన విధానం, అల్లు అర్జున్ చేసిన విధానం అద్భుతం అన్నాడు.

డిసెంబర్ 6న థియేటర్లలోకి...
‘పుష్ప 2: ది రూల్’ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌ను ఇటీవలే లాక్ చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. శరవేగంగా మూడు యూనిట్లతో సినిమాను షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నవంబర్ రెండో వారంలో ట్రైలర్...
‘పుష్ఫ 2’ ప్రమోషన్లను నిర్మాతలు భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు సమాచారం. నవంబర్ రెండో వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ.650 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే ఈ సినిమా బ్రేక్ఈవెన్ అవుతుందన్న మాట. కానీ జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతుందనేది ట్రేడ్ నిపుణుల మాట.

Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??

బాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్
‘పుష్ఫ 2’ ప్రమోషన్లలో ఈ సారి టీమ్ బాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టనుందని తెలుస్తోంది. ‘పుష్ఫ 1’ బాలీవుడ్‌లో రూ.115 కోట్లకు పైగా వసూలు చేసింది. కోవిడ్ థర్డ్ వేవ్‌ను కూడా తట్టుకుని నిలబడి భారీ వసూళ్లను ‘పుష్ప 2’ సాధించడం విశేషం. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు ‘పుష్ప 2’కు సంబంధించిన వైరల్ కంటెంట్‌తో వీడియోలు చేశారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు కూడా గ్రౌండ్‌లో శ్రీవల్లి స్టెప్ వేయడం విశేషం.

రూ.700 కోట్ల నెట్ ఓపెన్ అవుతుందా?
2017లో వచ్చిన ‘బాహుబలి 2’ బాలీవుడ్‌లో రూ.500 కోట్ల నెట్ క్లబ్‌ను ఓపెన్ చేసింది. ఆ తర్వాత ‘పఠాన్’, ‘గదర్ 2’, ‘జవాన్’, ‘యానిమల్’ అందులో చేరాయి. 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల అయిన ‘స్త్రీ 2’ ఏకంగా రూ.600 కోట్ల క్లబ్‌ను ఓపెన్ చేసింది. ఇప్పుడు ‘పుష్ప 2’కి ఉన్న క్రేజ్‌కి సరైన టాక్ పడితే రూ.700, రూ.800 కోట్ల క్లబ్‌ను కూడా ఓపెన్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన రిలీజ్ ప్లాన్ చేస్తే మొదటి రోజునే రూ.80 కోట్ల నెట్‌తో ‘పుష్ఫ 2’ ఓపెన్ అవుతుందని అంచనా. మరి పుష్ప గాడి రూలు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో తెలియాలంటే డిసెంబర్ 6వ తేదీ వరకు ఆగాల్సిందే.

Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Samsung Galaxy Ring: స్మార్ట్ రింగ్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.1,999కే బుకింగ్!
స్మార్ట్ రింగ్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.1,999కే బుకింగ్!
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
Embed widget