అన్వేషించండి
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ - 'మురారి బావ' సాంగ్ ను యాడ్ చేశారట
కలెక్షన్స్ తగ్గుతున్న సమయంలో ఇప్పుడు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి 'సర్కారు వారి పాట' సినిమాలో మరో పాటను యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
![Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ - 'మురారి బావ' సాంగ్ ను యాడ్ చేశారట Murari Bava song added in Sarkaru Vaari Paata Movie Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ - 'మురారి బావ' సాంగ్ ను యాడ్ చేశారట](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/01/bcc4008d104fd9b3eb09c0cb1e4333e9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'మురారి బావ' సాంగ్ ను యాడ్ చేశారట
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. టాక్ సంగతి పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
కలెక్షన్స్ తగ్గుతున్న సమయంలో ఇప్పుడు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి ఈ సినిమాలో మరో పాటను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి 'మ మ మహేశా...' సాంగ్ ప్లేస్‌లో ముందు మరో పాట అనుకున్నారు. అదే 'మురారి బావ' సాంగ్. మహేష్ కెరీర్‌లో మురారి సినిమా చాలా స్పెషల్. అందుకే.. 'మురారి' అంటూ ఓ పాట రాయించారు. అయితే.. సినిమా అంతా చూసిన తర్వాత అక్కడ ఒక మాస్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడు పరశురామ్ భావించారు.
మహేష్ బాబు, సంగీత దర్శకుడు తమన్‌కు ఆ విషయం ఆయన చెప్పడం.. వెంటనే 'మురారి' బదులు 'మ మ మహేశా..' అంటూ మాస్ పాట కంపోజ్ చేసి తమన్ తీసుకు రావడం జరిగాయి. మహేష్ కూడా ఓకే చేశారు. అలా, 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా' వచ్చింది. అభిమానుల కోసం 'మురారి' పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తామని మహేష్ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు ఏకంగా సినిమాలో యాడ్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరిన్ని కలెక్షన్స్ రాబట్టుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ వారం 'మేజర్', 'విక్రమ్' లాంటి క్రేజీ బజ్ ఉన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వీటి మధ్యలో 'సర్కారు వారి పాట' నిలబడం కష్టమే. మరేం జరుగుతుందో!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion