Sunny Leone: సన్నీ లియోన్ సాంగ్ పై హోం మినిస్టర్ ఫైర్.. మూడు రోజుల్లో ఆ పని చేయకుంటే..
బాలీవుడ్ నటీ సన్నీ లియోన్ నటించిన ఓ వీడియోపై వివాదం చెలరేగుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. పలువురు విమర్శిస్తున్నారు.
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఓ పాటపై డ్యాన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ పాటపై వివాదం చెలరేగుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ.. వీడియోను మూడు రోజుల్లో తీసేయకుంటే.. తర్వాత కఠిన చర్యలు ఉంటాయని.. మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా... సన్నీ లియోన్ తోపాటు ఆ పాటను ఆలపించిన గాయకులను హెచ్చరించారు.
‘మధుబన్ మే రాధిక నాచే’ సాంగ్ ఇటీవలే హిందీలో విడుదలైంది. ఈ పాటను షరీబ్, తోషి పాడారు. దీనిపై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ డ్యాన్స్ చేశారు. 1960లో వచ్చిన ‘కోహినూర్’ చిత్రంలోని ‘మధుబన్ మే రాధిక నాచే రే’ అనే పాటలోని పల్లవితో ఈ పాట పోలి ఉంటుంది. అప్పటి పాటను మహ్మద్ రఫీ పాడగా.. దిలీప్ కుమార్ నటించారు. డిసెంబర్ 22న కొత్త పాట విడుదలైంది. ఈ పాటపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొంతమంది అర్చకులు విమర్శలు చేశారు. సన్నీ లియోన్ చేసిన ఈ వీడియోను నిషేధించాలని డిమాండ్ చేశారు. 'మధుబన్ మే రాధిక నాచే' పాటలో "అశ్లీల" నృత్యం చేయడం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.
ఇప్పుడు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ కూడా ఈ పాటపై విమర్శలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సన్నీ లియోన్, షరీబ్, తోషి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మూడు రోజుల సమయం ఇస్తున్నామని..ఈలోపు ఆ వీడియోను తొలగించకుంటే.. తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
कुछ विधर्मी लगातार हिंदू भावनाओं को आहत कर रहे हैं। ‘मधुबन में राधिका नाचे’ ऐसा ही कुत्सित प्रयास है। मैं सनी लियोनी जी व शारिब तोशी जी को हिदायत दे रहा हूं कि समझें और संभलें। अगर तीन दिन में दोनों ने माफी माँगकर गाना नहीं हटाया तो हम उनके खिलाफ एक्शन लेंगे। pic.twitter.com/9DbgQV4cuy
— Dr Narottam Mishra (@drnarottammisra) December 26, 2021
ఈ ఏడాది అక్టోబర్‌లో, మంగళసూత్రాన్ని ఉద్దేశిస్తూ.. ఓ జ్యువెలరీ సంస్థ యాడ్ రూపొందించింది. ఈ ప్రకటనపైనా నరోత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకటనను ఉపసంహరించుకోవాలని, లేకుంటే చట్టబద్ధమైన చర్యను ఎదుర్కోవాలని మిశ్రా హెచ్చరించారు. దీంతో.. ఆ సంస్థ ప్రకటనను ఉపసంహరించుకుంది.
కొన్ని రోజుల ముందు, డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫెమ్ క్రీమ్ బ్లీచ్ ప్రకటనపైనా మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ ప్రకటననూ ఉపసంహరించుకున్నారు.
Also Read: Telugu Indian Idol: 'ఆహా'లో ఇండియా ఐడల్.. హోస్ట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్..
Also Read: Radhe Shyam: తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..
Also Read: Naveen Polishetty: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..