Mouni Roy Wedding: దుబాయ్ ప్రియుడిని పెళ్లిచేసుకున్న నాగిన్ బ్యూటీ...
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పెళ్లి పీటలెక్కింది. గురువారం తన బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహం జరిగింది.
బాలీవుడ్ నటి మౌని రాయ్ తన ప్రియుడు సూరజ్ నంబియార్ ను పెళ్లిచేసుకుంది. గోవాలో జరిగిన వేడుకలో మలయాళీ సాంప్రదాయం ప్రకారం మౌనీ-సూరజ్ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. దుబాయ్‌లో సెటిల్ అయిన సూరజ్‌తో గతకొంత కాలంగా రిలేషన్‌లో ఉంది మౌనీ రాయ్. మౌని రాయ్.. 2004లోనే సినిమాల్లోకి వచ్చినా.. 'నాగిన్' సీరియ్‌తో బాగా పేరొచ్చింది. నాగిని పేరుతో అదే సీరియల్ తెలుగులోకి డబ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.
View this post on Instagram
బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). ఇప్పుడు. బ్రహ్మాస్త్ర, మొగుల్ సినిమాల్లో నటిస్తోంది.
Everything 🧿
— Mouni Roy (@Roymouni) January 26, 2022
ॐ नमः शिवायः
🔱 pic.twitter.com/6KvK72jceq
మీ ప్రేమ ఆశీస్సులు కావాలని మౌనీ ఎమోషనల్ ట్వీట్ చేయగా... నా ప్రాణ స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాను. అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నాను .. అంటూ సూరజ్ ట్వీట్ చేశాడు. అనుష్క శర్మ సహా పలువురు సినీ టెలివిజన్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. మౌనీ రాయ్ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీతో తాడికొండ ఎపిసోడ్ ముగుస్తుందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి