Pawan Kalyan: ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. పవన్‌కు చిరంజీవి విషెస్.. బన్నీ, మహేష్ సైతం..
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్‌డేట్స్.. పోస్టర్లు కూడా విడుదలవుతున్నాయి. అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ ఫొటోలతో ప్రత్యేకమైన కామన్ డీపీలను తయారు చేస్తూ తమ అకౌంట్లలో ప్రొఫైల్ ఫొటోలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక పవర్ స్టార్‌ను విషెస్ చేసిన ప్రముఖుల్లో.. ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.
‘‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన. ప్రతి అడుగు.. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని తెలిపారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. చిరు-పవన్ ఎప్పుడూ కలిసి ఉండటాన్ని ఇష్టపడే మెగా అభిమానులు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసుకుని మరీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా చిరంజీవిని కలిసి అభినందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ హత్తుకుని మరీ తన ఆప్యాయతను చూపించారు. ఆ చిత్రాలను ఈ రోజు ట్వీట్ చేసి మరీ తన సోదరుడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.
పవన్‌కు సినీ ప్రముఖుల విసెష్:
మహాష్ బాబు: Happy birthday @PawanKalyan! Wishing you a truly amazing year and great health always!
అల్లు అర్జున్: Many many happy returns of the day to my PawanKalyan garu. May this day and the coming year bring you more n more peace and happiness.
రామ్ చరణ్: My Inspiration… My Guru... Wishing Power Star Pawan Kalyan Garu a Very Happy Birthday
వెంకటేష్: Happy birthday to a very special person, my dear friend @PawanKalyan! Wishing you peace, health and lots of happiness !!
నితిన్: Wishing our POWERSTAR a veryy happy birthdayy!! Love u forever sir
Also Read: పవర్ స్టార్ @ 50: బాల్యం నుంచి నేటి వరకు.. పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!