Mega Blockbuster: రోహిత్, గంగూలీ, రష్మిక, కార్తీల మెగా బ్లాక్‌బస్టర్ - ఏం జరుగుతుందో?
రోహిత్, గంగూలీ, రష్మిక, కార్తీల మెగా బ్లాక్‌బస్టర్ ట్రైలర్ సెప్టెంబర్ 4వ తేదీన లాంచ్ కానుంది.
భారత క్రికెటర్ రోహిత్ శర్మ క్రికెట్ కాకుండా అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే పేరు ఉన్న పోస్టర్‌ను ఆయన తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశారు. ఇది సినిమానా, వెబ్ సిరీస్‌నా లేక డాక్యుమెంటరీనా, అడ్వర్టైజ్‌మెంటా అన్నది తెలియరాలేదు. దీనికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 4వ తేదీన లాంచ్ కానుంది.
దీనికి క్యాప్షన్‌గా ‘Butterflies in my stomach. A debut of a kind.’ అని పెట్టారు. అంటే ‘నా కడుపులో సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన ఆరంభం.’ అని అర్థం. దీనిపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో తమిళ హీరో కార్తీ, హీరోయిన్ రష్మిక మందన్న, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీలు ఈ మెగా బ్లాక్‌బస్టర్‌లో భాగం అయ్యారు. దీనికి సంబంధించిన పోస్టర్లను వారు షేర్ చేశారు.
సూపర్-4కు సిద్ధం
మరోవైపు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆదివారం జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు సిద్ధం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది. అయితే ఇది సాధ్యం కావాలంటే హాంగ్ కాంగ్‌పై పాకిస్తాన్ విజయం సాధించాలి.
View this post on Instagram
View this post on Instagram
Stay tuned to find out more...! #MegaBlockbuster #StayTuned pic.twitter.com/W2VAygN5o7
— Actor Karthi (@Karthi_Offl) September 1, 2022
View this post on Instagram