అన్వేషించండి

Sriya Reddy: ‘సలార్’ మూవీలో దుమ్మురేపిన విశాల్ వదిన, శ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అంతే!

Sriya Reddy: ‘సలార్’ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వీరితో పాటు అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించింది నటి శ్రియారెడ్డి.

Sriya Reddy In Salaar Movie: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘సలార్’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయ్యింది. డిసెంబర్ 22న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలి షో నుంచి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హీరోయిన్ శృతి హాసన్ సైతం ఆధ్య పాత్రలో ఆకట్టుకుంది. వీరితో పాటు మరో నటి గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు శ్రియా రెడ్డి. ఈ చిత్రంలో ఆమె రాధా రమా మన్నార్ పాత్రలో కనిపించింది. అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది. ‘బాహుబలి‘ సినిమాలో శివగామి పాత్ర మాదిరిగానే ‘సలార్‘ చిత్రంలో రాధారమా మన్నార్ పాత్ర ఉంది. రాధారమా పాత్రకు శ్రియారెడ్డి నూటికి నూరు శాతం న్యాయం చేసిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sriya Reddy (@sriya_reddy)

ఇంతకీ శ్రియా రెడ్డి ఎవరు?

41 ఏళ్ల శ్రియా రెడ్డి తమిళంతో పాటు తెలుగులోనూ నటిగా రాణిస్తోంది. ఆమె తండ్రి భరత్ రెడ్డి. వృత్తిరీత్యా క్రికెటర్. శ్రియా తమిళ చిత్రం ‘సమురాయ్‌‘తో వెండితెరకు పరిచయం అయ్యింది. 2003లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా అందిరినీ ఆకట్టుకుంది. ‘అప్పుడప్పుడు‘ అనే మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది‘ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కనిపించింది. ఇక విశాల్ ‘పొగరు‘ సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే నటుడు హీరో విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. సినిమా పరిశ్రమకు చాలా కాలం దూరం అయ్యింది. దాదాపు దశాబ్దం తర్వాత శ్రియా మళ్లీ ‘సలార్‘లో కనిపించింది. ఇందులో వరదరాజు మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరి రాధా రమా పాత్రను శ్రియా పోషించింది. 

2018లో విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకున్న శ్రియా రెడ్డి

శ్రియారెడ్డి 2008లో సినీ నిర్మాత,నటుడు, విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. 2018లో తమిళంలో ‘సిల సమయంగళిల్‘ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. ‘సలార్‘తో మరోసారి వెండితెరపై సత్తా చాటింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by LOVECO (@lo.ve.co)

‘సలార్‘ గురించి..

‘KGF‘ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Also Read: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Embed widget