Manchu Lakshmi: జెనిలియాతో మంచు విష్ణు.. ఆమె భర్తతో మంచు లక్ష్మి..
ముంబైలో ఉన్న జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో తీసుకున్న సెల్ఫీను ముందుగా తన తమ్ముడు మంచు విష్ణుకి పంపించిందట మంచు లక్ష్మీ. దానికి రిప్లై ఏం వచ్చిందంటే..?
నిన్న జరిగిన 'మా' ఎన్నికల్లో భారీ మెజారిటీతో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంచు లక్ష్మీ 'నా తమ్ముడా మజాకా' అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ఇక తాజాగా మరో పోస్ట్ పెట్టింది మంచువారమ్మాయి. ముంబైలో ఉన్న జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో తీసుకున్న సెల్ఫీను ముందుగా తన తమ్ముడు మంచు విష్ణుకి పంపించిందట మంచు లక్ష్మీ. దానికి రిప్లైగా మంచు విష్ణు, జెనీలియాతో ఫోటో తీసుకొని పంపించాడట.
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన మంచు లక్ష్మీ.. రెండు ఫోటోలను క్లబ్ చేసి షేర్ చేసింది. ఇది చూసిన జెనీలియా.. సో క్యూట్ అంటూ కామెంట్ చేసింది. రితేష్ అయితే.. నెక్స్ట్ ఫోటో అందరం కలిపి తీసుకోవాలంటూ పోస్ట్ పెట్టారు. నిన్న జరిగిన 'మా' ఎలెక్షన్స్ కోసం జెనీలియా ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఓటు వేయడానికి వచ్చిన ఆమెని ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎంతో ఆత్మీయంగా పలకరించారు.
వీరిద్దరితో కలిసి నటించింది జెనీలియా. మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'ఢీ' సినిమాలో జెనీలియానే హీరోయిన్. మంచు ఫ్యామిలీతో ఈ బ్యూటీకి మంచి బాండింగ్ ఉంది. తన ఓటు కూడా మంచు విష్ణుకే వేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓటేసిన అనంతరం ముంబై ఫ్లైట్ ఎక్కి చెక్కేసింది జెనీలియా.
View this post on Instagram
Next picture should be all of us together !!! @LakshmiManchu @iVishnuManchu @geneliad https://t.co/gJndvTCIPB
— Riteish Deshmukh (@Riteishd) October 11, 2021
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి