By: ABP Desam | Updated at : 25 Oct 2022 09:36 AM (IST)
Edited By: manikumar.journalism007
maheshbabu/instagram
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. అప్పుడే ఒక యుట్యూబ్ ఛానెల్ పెట్టి తన ఫ్రెండ్స్ తో కలసి వీడియోలు చేస్తూ సొంతంగా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ ఎప్పుడూ అప్డేట్ లో ఉంటుంది సితార. ఇప్పటికే సితారను చూసి మహేష్, నమ్రత తెగ మురిసిపోతున్నారు.
పాటలు, డ్యాన్స్, డైలాగ్స్, రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది సితార. వీటితో పాటు కల్చరల్ యాక్టివిటీస్‌లో కూడా సితార శభాష్ అనుపించుకుంటోంది. తాజాగా సితార శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియోను మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో తన కూతురు గురించి చెప్తూ మురిసిపోయారు సూపర్ స్టార్ మహేశ్. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోను పోస్ట్ చేశారాయన. "నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్" అంటూ సితార గురించి రాసుకొచ్చారు మహేష్.
ఆ వీడియో లో అద్భుతమైన హావభావాలతో ఎంతో అందంగా డాన్స్ చేసింది సితార. ఇటీవల విడుదల అయిన మహేష్ సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట సినిమాలోని టైటిల్ సాంగ్‌కు ఎంతో చక్కగా డ్యాన్స్ చేసింది సితార. ఇప్పుడీ క్లాసికల్ డ్యాన్స్ వీడియో ను చూసిన మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ షూటింగ్ కి వెళ్లేప్పుడు తప్ప మిగతా టైం లో ఫ్యామిలీ తోనే ఎక్కువగా ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు సితారతో చేసిన రీల్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు మహేష్. ఈ మధ్యనే మహేష్ తో కలిసి సితార ఓ టివి లో ప్రోగ్రామ్‌ను ప్రమోట్ చేశారు. ఈ వీడియోస్ చూస్తే సితారకు సినిమాలు అంటే ఎంత ఆసక్తో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్ పై సితార ఎంట్రీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
ప్రస్తుతం మహేష్ బాబు షూటింగ్ లలో ఫుల్ బిజీ గా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఈ మధ్యే మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారు. దీని కోసం రెండు కథలను సిద్ధం చేశారట. అయితే ఈ సినిమాలో మహేష్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే భర్తను భార్య భరించాల్సిందేనా?
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
/body>