అన్వేషించండి

Nagababu Resign: ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా.. ఇక సెలవంటూ..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మెగా ఫ్యామిలీ మద్దతుతో బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ ఓటమితో నాగబాబు తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా).. ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. మెగా కుటుంబం మద్దతుతో పోటీలో నిలబడిన ప్రకాష్ రాజ్‌కు పరాజయం తప్పలేదు. దీంతో చిరంజీవి సోదరుడు, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్లో  ‘నా’ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు’’ అని నాగబాబు ట్వీట్ చేశారు. 

 మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. పదవులు కేవలం తాత్కాలికం మాత్రమేనని, అందరం సినీ కళామతల్లి బిడ్డలమని గుర్తుంచుకోవాలని అన్నారు. మా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అందరం కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. పదవుల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన మరొకర్ని దూషించడం, నిందించడం, దుష్ప్రచారం చేసుకోవడం సరైన పని కాదన్నారు. తాత్కాలిక పదవుల కోసం మనల్ని మనమే తిట్టుకోవడం అవసరమా అని చిరంజీవి ప్రశ్నించారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు అవసరం లేదని, వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలని మా నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.

పదవుల కోసం సినీ నటులమైన తాము ఒకర్నొకరు తిట్టుకోవడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో చులకన అయిపోతామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కావొద్దని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. వివాదాలు పుట్టించిన వ్యక్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరస్పరం తిట్టుకుంటూ పరువు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. తమది వసుదైక కుటుంబమని, కలిసికట్టుగా సినీ పరిశ్రమను డెవలప్ చేసుకోవాలన్నారు. 

Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!

Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Embed widget