RGV - Maa Ishtam: ఆ రోజున థియేటర్లలో వర్మ 'ఇష్టం'
'మా ఇష్టం' అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.

ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే? అనే కథాంశం తీసుకుని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన క్రైమ్ డ్రామా సినిమా 'మా ఇష్టం'. ఇందులో నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రధారులు. ఇంతకు ముందు ఈ సినిమాకు 'డేంజరస్' అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు టైటిల్ చేంజ్ చేశారు.
మన దేశంలో రూపొందిన మొట్టమొదటి లెస్బియన్ ప్రేమకథా చిత్రం 'మా ఇష్టం' అని వర్మ చెబుతున్నారు. 377 సెక్షన్‌ను రద్దు చేసిన తర్వాత లెస్బియన్ నేపథ్యంలో క్రైమ్ డ్రామాగా ఇండియాలో తెరకెక్కిన మొట్ట మొదటి చిత్రమిది తెలిపారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8న తారీఖు థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
"ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా... ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎటువంటి పరిస్థితులకు దారి తీసిందనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా 'మా ఇష్టం' రూపొందింది" అని చిత్రబృందం పేర్కొంది.
Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?
Also Read: కలవని ప్రేమికులు, విడిపోని యాత్రికులుగా ప్రభాస్ - పూజా హెగ్డే!
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















