అన్వేషించండి

Zeenat Aman: పెళ్లికి ముందే ‘అలా’ చెయ్యండి - యువతకు బాలీవుడ్ సీనియర్ నటి క్రేజీ అడ్వైజ్, తిట్టిపోస్తున్న నెటిజన్స్

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ యువతకు క్రేజీ అడ్వైజ్ ఇచ్చారు. పెళ్లి కంటే ముందు సహజీవనం చేయాలని సూచించారు. అప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వెల్లడించారు.

Bollywood Actress Zeenat Aman's Advice For Youth: బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దమ్‌ మారో దమ్‌’ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. కెరీర్ మంచి జోష్ లో ఉండగానే, నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు సాఫీగా సాగిన వివాహ జీవితం ఆ తర్వాత ముందుకు కొనసాగలేకపోయింది. మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండూ జీనత్, ఎప్పటికప్పుడు యువతకు పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు.   

పెళ్లికి ముందు సహజీవనం చేయండి- జీనత్ అమన్

కొద్ది రోజుల క్రితం ప్రేమ, డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్డించారు జీనత్ అమన్. యువత తమ ఫీలింగ్స్ ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మనసుకు నచ్చగానే మంచం ఎక్కేయకూడదన్నారు. ఎదుటి వారి కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదని చెప్పారు. ఇక తాజాగా యువతకు మరో కీలక సలహా ఇచ్చారు జీనత్. తన గత పోస్టుకు రిలేషన్ షిప్ గురించి సలహాలు ఇవ్వమని చాలా మంది కామెంట్స్ పెట్టారని.. వారి కోసం ఓ విషయం చెప్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇంతకు ముందు ఎప్పుడూ, ఎక్కడ చెప్పని ఓ విషయాన్ని చెప్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రేమలో ఉన్న వాళ్ల కోసం ఈ సలహా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రేమలో ఉన్న వాళ్లు పెళ్లికి ముందుకు సహజీవనం చేయాలని సలహా ఇచ్చారు. ఇద్దరికి నచ్చితేనే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిదన్నారు. తన కొడుకులకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు వివరించారు.    

బెడ్ రూమ్, బాత్ రూమ్ మాత్రమే కాదు..

“ప్రేమలో ఉన్న వారికి రోజూ కొన్ని గంటల పాటు సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ, అదే ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండగలుగుతారేమో ఆలోచించాలి. బాధలో ఉన్నప్పుడు నిజంగానే ఎదుటి వారిని ఓదార్చగలుగుతారా? మీకు నచ్చింది వండేందుకు ఒప్పుకుంటారా? బెడ్‌ రూమ్‌, బాత్‌ రూమ్‌ మాత్రమే కాదు, అన్నింటినీ అలాగే పంచుకుంటారా? అడ్జెస్ట్ అవుతారా? అనే విషయంలో క్లారిటీ అనేది చాలా ముఖ్యం. సహజీవనం మంచిదే అయినా, సమాజం దాన్నో తప్పుగా భావిస్తోంది. చాలా మంచి విషయాల్లోనూ సొసైటీ తప్పుడు భావనతోనే ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు మంచి చేసే విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు” అని తన ఇన్ స్టా వేదికగా జీనత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం జీనత్ 'బన్ టిక్కి' చిత్రంతో నటిస్తున్నారు. ఇందులో ఆమె అభయ్ డియోల్, షబానా అజ్మీ తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే, జీనత్ కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి సలహాలు మన సాంప్రదాయాలను ప్రమాదంలో పడేస్తాయని అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zeenat Aman (@thezeenataman)

 Read Also : అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget