అన్వేషించండి

Taapsee Pannu: అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి

హీరోయిన్ తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆమె సీక్రెట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన పెళ్లి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో తాజా వెల్లడించింది.

Taapsee Pannu Speaks About Her Marriage: సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. సౌత్‌తో పాటు నార్త్ లోనూ హీరోయిన్ గా బోలెడు సినిమాలు చేసింది. సుమారు దశాబ్దం పాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. ఇక్కడ నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది. ఇక తనకు నచ్చిన విషయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. ఇక తాజాగా ఈ పంజాబీ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో మూడు ముళ్లు వేయించుకుంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా ఈ వివాహం జరిగింది. అయితే, తన పెళ్లిని సీక్రెట్ గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో ఆమె తాజాగా వెల్లడించింది.

పెళ్లిని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందంటే?- తాప్సీ

పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ, పలు కీలక విషయాలను వెల్లడించింది. పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయం కావడం వల్లే రహస్యంగా ఉంచినట్లు చెప్పుకొచ్చింది. “నా పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పాలి అనుకోలేదు. నా పెళ్లి గురించి ఎదుటి వారిలో క్యూరియాసిటీ కలిగించాలి అనుకోలేదు. నా పెళ్లి గురించి చర్చ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం. అయితే, పెళ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకోలేదు. పెళ్లి ముందు అనవసర చర్చ వద్దు అనుకున్నాం. మా బంధుమిత్రులకు మా పెళ్లి గురించి తెలుసు. వాళ్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా జరుపుకోవాలి అనుకున్నాం. హంగు ఆర్భాటాలకు తావు లేకుండా ముఖ్యమైన వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. నా పెళ్లి, ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయాలి అనుకోవడం లేదు. మున్ముందు పంచుకోవాలి అనిపిస్తే షేర్ చేస్తాను” అని చెప్పుకొచ్చింది. మార్చి 23న ఉదయ్‌ పూర్‌ లో తాప్సీ, మాథియాస్ బో పెళ్లి జరిగింది. రీసెంట్ గా వీరి పెళ్లికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.  

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

ఇక తాప్సీ పన్ను రీసెంట్ గా ‘డంకీ’ అనే సినిమాలో నటించింది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ‘హసీన్‌ దిల్‌రుబా’కు సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌ రుబా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు  జయ్‌ ప్రద్‌ దేశాయ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రాంత్‌ మాస్సే హీరోగా నటిస్తున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.  

Read Also: పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సూట్ అవ్వరు, వాళ్లకు మాత్రమే నా సపోర్ట్ - కోన వెంకట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget