Liger Movie Update: 'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసిన మైక్ టైసన్
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ చిత్రం 'లైగర్' (సాలా క్రాస్బ్రీడ్) కోసం డబ్బింగ్ పూర్తి చేసిన మైక్ టైసన్.
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్'. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టారు. యుఎస్ఎ లో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. 'నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు' అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.
మైక్ టైసన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. అతనిపై చిత్రించిన సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే. పెద్ద స్క్రీన్ లపై నిజమైన యాక్షన్ ని చూసేందుకు సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: లైంగిక వేధింపుల కేసు - 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్ పై చార్జ్‌షీట్
View this post on Instagram
View this post on Instagram