News
News
X

Padmaja Raju Passes Away: దిగ్గజ నటుడు హరనాథ్ కుమార్తె పద్మజా రాజు హఠాన్మరణం

దిగ్గజ నటుడు హరనాథ్ కుమార్తె పద్మజా రాజు(54) కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె గుండె పోటుతో మృతి  చెందినట్లు సమాచారం.

FOLLOW US: 
Share:

దిగ్గజ నటుడు హరనాథ్ కుమార్తె, నిర్మాత జి.వి.జి రాజు భార్య పద్మజా రాజు(54) కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె గుండె పోటుతో మృతి  చెందినట్లు తెలిసింది. పద్మజా రాజు కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె అన్న శ్రీనివాస రాజు కూడా నిర్మాతే. పద్మజా రాజు హఠాన్మరణం తో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పద్మజా మరణ వార్తతో ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు, నటీనటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 

దిగ్గజ నటుడు హరనాథ్ కుమార్తెగా ఇండస్ట్రీలో పరిచయం ఉన్నప్పటికీ ముందునుంచీ తన భర్త జి.వి.జి రాజు కు చేదోడువాదోడుగా ఉంటున్నారు పద్మజా. జి.వి.జి రాజుకు కూడా ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది. ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’ సినిమాలను నిర్మించారు. తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘గోదావరి’ ను కూడా నిర్మించారు రాజు. 

ఇటీవలే పద్మజా రాజు.. ఆమె తండ్రి హరనాథ్ గురించి ‘అందాల నటుడు’ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. అలాగే తన ఇద్దరి కుమారులలో ఒకరిని ఇండస్ట్రీకు నిర్మాతగా త్వరలోనే పరిచయం చేస్తానని ఆమె తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతలోనే ఆమె హఠాన్మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం(21 డిసెంబర్, 2022)నాడు ఉదయం మహా ప్రస్థానంలో పద్మజా రాజు అంత్యక్రియలు జరగునున్నట్లు తెలుస్తోంది.

Also Read: వామ్మో, ప్రాణాలు పోతే? హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ డేరింగ్, సినిమా చరిత్రలోనే అత్యంత ప్రమాదకర స్టంట్!

Published at : 20 Dec 2022 07:39 PM (IST) Tags: Haranath Haranath Daughter Padmaja Raju GVG Raju

సంబంధిత కథనాలు

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

Upcoming Movies This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Upcoming Movies This Week: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Nikhil On SPY Movie: నిఖిల్ స్పై థ్రిల్లర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్, రిలీజ్ ఎప్పుడంటే?

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

Sundeep Kishan: ‘విక్రమ్’ నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

టాప్ స్టోరీస్

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!