Lavanya Tripathi Gets Busy : చేతిలో మూడు, రెడీగా రెండు - స్పీడ్ పెంచిన లావణ్య
Lavanya Tripathi : సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి స్పీడ్ పెంచారు. రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
'అందాల రాక్షసి'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) పంథా మిగతా అందాల భామలకు భిన్నంగా ఉంటుంది. ముందు నుంచి ఆవిడ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నిదానంగా ముందుకు వెళుతున్నారు. కానీ, ఇప్పుడు స్పీడ్ పెంచారు. వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం లావణ్య చేతిలో మూడు ప్రాజెక్టులు!
Lavanya Tripathi Upcoming Movies : ఇప్పుడు లావణ్యా త్రిపాఠి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ సినిమా. తెలుగులో వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'లో కీలక పాత్రలో నటించిన అథర్వ మురళి ఉన్నారు కదా! లావణ్యా త్రిపాఠి చేస్తున్న తాజా తమిళ సినిమాలో అతను హీరో. ఆల్రెడీ టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో రెండు పాటలు షూట్ చేస్తే... సినిమా కూడా కంప్లీట్ అవుతుంది.
లావణ్యా త్రిపాఠి తెలుగు ప్రాజెక్టులకు వస్తే... జీ 5 కోసం రూపొందుతోన్న వెబ్ సిరీస్‌లో ఆవిడ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దానికి కోన వెంకట్ దర్శకుడు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా మంజునాథ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో కూడా లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు.
కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్!
Lavanya Tripathi New Movies : ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి చేతిలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉండగా... ఇవి విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో ఆయా సినిమాల వివరాలను వెల్లడించనున్నారు. ఆ రెండూ కొత్త కాన్సెప్ట్‌లతో ఉంటాయని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడంతో పాటు వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనను కొత్తగా ఆవిష్కరించుకోవాలని లావణ్యా త్రిపాఠి ఆలోచిస్తున్నారట. అదీ సంగతి!
Also Read : ఓ ఇంటివాడు కాబోతోన్న నాగశౌర్య - ఆయన పెళ్లి ఎప్పుడంటే?
లావణ్యా త్రిపాఠి నటించిన లాస్ట్ సినిమా 'హ్యాపీ బర్త్ డే' జూలైలో విడుదల అయ్యింది. అందులో ఆమె డ్యూయల్ రోల్ చేశారు. ఆవిడ పాత్రకు మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ... సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. బాక్సాఫీస్ బరిలో ఫ్లాప్ అయ్యింది. లావణ్యా త్రిపాఠి సినిమాల కంటే వ్యక్తిగత జీవితం అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఆవిడ పెళ్లి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. పుకార్ల గురించి లావణ్యా త్రిపాఠి ఎప్పుడూ స్పందించినది లేదు.
View this post on Instagram