Naga Shourya Anusha Wedding : ఓ ఇంటివాడు కాబోతోన్న నాగశౌర్య - ఆయన పెళ్లి ఎప్పుడంటే?
యువ కథానాయకుడు నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన త్వరలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యారు. ఆయన పెళ్లి ఎప్పుడంటే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెళ్లి సందడి మొదలైంది. యువ కథానాయకుడు నాగశౌర్య (Naga Shourya) త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. ఆయన పెళ్లి చేసుకోనున్నారు.
బెంగళూరులో శౌర్య పెళ్లి!
Naga Shourya Weds Anusha : నాగశౌర్య పెళ్లి నవంబర్ 20న బెంగళూరులో జరగనుంది. విఠల్ మాల్య రోడ్డులోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ ఆయన పెళ్ళికి వేదిక కానుంది. ఆదివారం (నవంబర్ 20) ఉదయం 11.25 గంటలకు అనూష (Naga Shourya Fiance Name Anusha ) తో ఆయన పెళ్లి జరగనుంది. ఆల్రెడీ పెళ్లి పనులు ప్రారంభించారు. శౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతోంది. పెళ్ళికి ముందు రోజు మెహందీ ఫంక్షన్ ఉంటుందని తెలిసింది. ఈ విషయం తెలిసి నాగశౌర్యకు అభిమానులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నాగశౌర్య పెళ్లి శుభలేఖను చూడండి :
పెళ్లి నేపథ్యంలో చేసిన శౌర్య!
'కృష్ణ వ్రింద విహారి'తో సెప్టెంబర్ 23న నాగశౌర్య థియేటర్లలోకి వచ్చారు. విశేషం ఏమిటంటే... పెళ్లి నేపథ్యంలో రూపొందిన సినిమా అది. అందులో కట్టుబాట్లు పద్ధతి పడికట్లకు విలువ ఇచ్చే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడిగా శౌర్య కనిపించారు. మోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడిన అతడు... పెళ్లి తర్వాత తల్లికి, భార్యకు మధ్య నలిగిపోయే పాత్రలో నటించారు. పెళ్లి నేపథ్యంలో సినిమా చేసిన వెంటనే ఆయన ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతుండటం విశేషం.
పెళ్లి గురించి హింట్ ఇచ్చిన శౌర్య తల్లి!
'కృష్ణ వ్రింద విహారి' విడుదల సమయంలో నాగశౌర్య పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆ సినిమాకు ఆయన తల్లి ఉషా ముల్పూరి నిర్మాత. సినిమా విడుదలకు ముందు అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతూ ''ఈ తరం యువతకు పెళ్లి విషయంలో స్పష్టత ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అయినా ఈ కాలం పిల్లల మాట వింటారా?'' అని అన్నారు. త్వరలో పెళ్లి ఉంటుందని హింట్ ఇచ్చారు.
Also Read : 'లైగర్' గాయాలు - విజయ్ దేవరకొండకు ఎనిమిది నెలల తర్వాత
కొత్త సినిమా స్టార్ట్ చేసిన శౌర్య
ఇటీవల నాగశౌర్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. హీరోగా ఆయనకు 24వ సినిమా అది. ఆ చిత్రాన్ని నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలంతో వైష్ణవి ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి నిర్మించనున్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర విభిన్నంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎత్న్రి ఇస్తున్నారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రానికి ఎడిషనల్ స్క్రీన్‌ప్లే : ఎస్‌వి శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బండి భాస్కర్.