Dheera Movie: క్యారెక్టర్ లేని కరెన్సీ నోటు లాంటోడు, యుద్ధం చేసే రాముడు - 'ధీర' ట్రైలర్ చూశారా?
Dheera trailer review: లక్ష్ చదలవాడ హీరోగా నటించిన సినిమా 'ధీర'. ఫిబ్రవరి 2న విడుదల కానుంది. రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?

Laksh chadalavada's Dheera movie trailer review: యువ కథానాయకుడు లక్ష్ చదలవాడ నటించిన తాజా సినిమా 'ధీర'. నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లు. 'వలయం', 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాల తర్వాత లక్ష్ నటించిన చిత్రమిది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో భారీ ఎత్తున సినిమా విడుదల చేయనున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?
నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని నాకు కారెక్టర్ లేదు
'ధీర' ట్రైలర్ చూస్తే... యాక్షన్, రొమాన్స్ మిక్స్ చేసి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. 'ఈ మనిషి బ్రెయిన్ ఉంది చూడు... అది వెరీ డేంజరస్' అని వచ్చే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'రాజ్ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే... రథం నడిపే కృష్ణుడితో పాటు యుద్ధం చేసే రాముడు రావాలి. ఎవడైనా ఉంటాడా?' అని డైలాగ్ రాగా... హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు. ''వాడి పేరు రణధీర్.. 6.2 ఉంటాడు'' అని లక్ష్ చదలవాడను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
'నేను కరెన్సీ నోట్ లాంటోడ్ని! నాకు క్యారెక్టర్ లేదు' అని హీరో చెప్పే డైలాగ్... ఆ తర్వాత 'ఐ లవ్యూ మనీషా... ఐ లవ్యూ అమృతా' అంటూ అమ్మాయిల వెంట పడటం చూపించారు. ఆ వెంటనే 'ఇప్పటి దాకా లవ్ స్టోరీ చూశావ్! ఇప్పుడు యాక్షన్ మూవీ చూపిస్తా' అంటూ హీరో యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. 'వాడు ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూకంపం తర్వాత భూమిలా ఉంటుంది' అని హీరోకి ఎలివేషన్ ఇచ్చారు.
'నేను యుద్ధం చేయడం ఏంట్రా? యుద్ధమే మిమ్మల్ని వెంటాడుతూ... వేటాడుతూ వస్తోంది. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు చేరింది' ట్రైలర్ చివరలో చెప్పే మాటతో మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: నైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?
''ధీర షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సెన్సార్ కూడా పూర్తి చేశాం. ఫిబ్రవరి 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్... రెండు ఉన్న చిత్రమిది'' అని దర్శక నిర్మాతలు చెప్పారు.
Also Read: హిమాలయాలకు వెళ్లిన గోపీచంద్... ఎందుకంటే?
లక్ష్ చదలవాడ హీరోగా నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లుగా నటించిన 'ధీర' సినిమాలో 'మిర్చి' కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, 'వైవా' రాఘవ, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కూర్పు: వినయ్ రామస్వామి, ఫైట్ మాస్టర్: జాషువా - 'వింగ్ చున్' అంజి, ఛాయాగ్రహణం: కన్నా పీసీ, సంగీతం: సాయి కార్తీక్, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాణ సంస్థ: బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత: పద్మావతి చదలవాడ, రచన - దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















