By: ABP Desam | Updated at : 28 Mar 2022 03:38 PM (IST)
క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన కృతి
తెలుగులో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో సినిమా అంగీకరించింది ఈ బ్యూటీ. సూర్య హీరోగా దర్శకుడు బాల ఓ సినిమాను రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'నందా', 'పితామగన్' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
ఈ సినిమాలతో నటుడిగా సూర్యకి మంచి పేరొచ్చింది. దాదాపు 18 ఏళ్ల తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టికి అవకాశం వచ్చింది. కెరీర్ బిగినింగ్ లోనే సూర్య లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. అది కూడా బాల డైరెక్షన్ అంటే.. కృతిశెట్టి లిస్ట్ లో మరో హిట్టు సినిమా పడినట్లే.
ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ మధ్యకాలంలో సూర్య తన సినిమాలతో హిట్టు మీద హిట్టు కొడుతున్నారు. 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' వంటి సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి భారీ విజయాలను అందుకున్నారు. రీసెంట్ గా 'ఈటీ - ఎవరికీ తలవంచడు' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.
Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్
Also Read: పూరితో మరోసారి - ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా విజయ్ దేవరకొండ!
Guppedantha Manasu జులై 1ఎపిసోడ్: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!
Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!
Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్‌తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!
Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!