Krishna Rama Shoot Wrap: రొటీన్‌కు భిన్నంగా ‘కృష్ణా రామా‘ మూవీ - షూటింగ్ పూర్తి
దర్శకుడు రాజ్ మాదిరాజు తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘కృష్ణా రామా‘. రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఫోటోను దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘కృష్ణా రామా‘ షూటింగ్ కంప్లీట్
‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ మాదిరాజు మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కృష్ణా రామా‘ పేరుతో సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో, అనన్య శర్మ శ్రీకాంత్ అయ్యంగార్, జెమిని సురేష్, చరణ్ లెక్కరాజు, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మేరకు దర్శకుడు చిత్ర బృందానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.
View this post on Instagram
మే తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న‘కృష్ణా రామా‘
అద్వితీయ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సుమారు రెండు నెలల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. సినిమా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, మే తర్వాత ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
‘కృష్ణా రామా‘ మూవీ కథేంటంటే?
ప్రతి రోజు సోషల్ మీడియాలో ఎదుర్కొనే సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అది మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుంది? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
View this post on Instagram
దర్శకుడు రాజ్ మాదిరాజు గురించి..
2000 సంవత్సరం తరుణ్ హీరోగా ‘అంకుల్’ అనే సినిమా చేశారు రాజ్ మాదిరాజు. ఆ తర్వాత ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘మై రొమాన్స్ విత్ లైఫ్’, ‘పైరేట్స్ 1.0’, ‘గ్రే’ సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘కృష్ణా రామా‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొటీన్ కు భిన్నమైన కథలతో చక్కటి చిత్రాలను తెరకెక్కించడంలో రాజ్ మాదిరాజు దిట్ట. తాజాగా ‘కృష్ణా రామా‘ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
View this post on Instagram
Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!