By: ABP Desam | Updated at : 11 Sep 2023 12:40 PM (IST)
కిరణ్ రాథోడ్(Photo Credit: KEIRA RATHORE/Instagram)
కిరణ్ రాథోడ్. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు వెండితెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 'అందరూ దొంగలే దొరికితే..', 'భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా', 'హై స్కూల్', 'కెవ్వు కేక' లాంటి చిత్రాలతో తెలుగు సినీ అభిమానులను అలరించింది. 2016లో తమిళంలో ఆమె నటించిన చిత్రం తెలుగులో 'భాజా భజంత్రీలు' పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు. సుమారు ఏడు సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఇండస్ట్రీలోకి సాలిడ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. కానీ, ఆమె ఆశ నెరవేరకుండానే హౌస్ నుంచి బయకు వచ్చేసింది. వారం రోజుల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా, రెమ్యునరేషన్ బాగానే అందుకున్నట్లు టాక్ నడుస్తోంది.
కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ వన్ తెలుగు రాకపోవడం. తెలుగు రాదనే ఒకే ఒక్క కారణంగా హౌస్ మేట్స్ ఆమెను నామినేట్ చేశారు. అయితే, నిజానికి ఆమె తెలుగు రాకపోయినా, హౌస్ లో మిగతా భాషల్లో చక్కగానే మాట్లాడింది. అయితే, తోటి కంటెస్టెంట్లతో సరిగా కలిసి ఉండలేకపోయింది. టాస్కుల విషయంలో యాక్టివ్ గా ఉన్నా, హౌస్ లో తన ప్రభావం అంతంత మాత్రమే అన్నట్లుగా కనిపించింది. ఇక బుల్లితెర ప్రేక్షకుల నుంచి తనకు పెద్దగా సపోర్టు కూడా దొరకలేదు. ఓట్లు కూడా తక్కువే వేశారు. తనను తాను నిరూపించుకునే అవకాశం కూడా ఆమె పెద్దగా దొరకలేదనే చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనా షో నుంచి ఆమె బయటకు వెళ్లిపోయింది.
ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కిరణ్ రాథోడ్ ఉన్నది తక్కువ రోజులే అయినా, సంపాదన విషయంలో మాత్రం ఆకట్టుకుంది. షోలో వారం రోజులు ఉన్న ఆమెకు రోజుకు రూ. 45 వేల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులు పారితోషికం అందించారట. అంటే వారం రోజులకు గాను రూ. 3 లక్షలకు పైనే ఆమె సంపాదించింది. అయితే, కిరణ్ కు మరో వారం రోజుల పాటు అవకాశం ఇచ్చి ఉంటే తన ఆటతీరులో మార్పు వచ్చేదనే టాక్ నెటిజన్లలో వినిపిస్తోంది. బిగ్ బాస్ నిర్ణయాన్ని తొందరపాటు నిర్ణయంగా వారు అభివర్ణిస్తున్నారు. సో, మొత్తంగా కిరణ్ రాథోడ్ ను బిగ్ బాస్ షో లోకి ఎందుకు తీసుకొచ్చారో? ఎందుకు వారం తిరగకుండానే ఎలిమినేట్ చేశారో అర్థం కాని అయోమయంలో ఉన్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు.
Read Also: అమెరికాలో సత్తా చాటుతున్న ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’, మిలియన్ డాలర్లు దాటిన వసూళ్లు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు
KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థమేంటి!
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
/body>