అన్వేషించండి
Advertisement
Kiran Abbavaram - NMBK First Look: కిరణ్ అబ్బవరం - మీకు బాగా కావాల్సినవాడు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న ఐదో సినిమాకు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi)నిర్మాత
శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కోడి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆమె, కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా సినిమా నిర్మిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. ఈ రోజు ఆ సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ (NMBK First Look) విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న సినిమాకు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavadini Movie) టైటిల్ ఖరారు చేశారు. కార్తీక్ శంకర్ రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. కిరణ్ అబ్బవరం మాసీగా కనిపిస్తున్నారు. హీరోగా ఆయనకు ఐదో సినిమా ఇది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భాస్కరభట్ల పాటలు రాయగా... ప్రవీణ్ పూడి ఎడిటింగ్, రాజ్ కె. నల్లి కెమెరా బాధ్యతలు చూస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూడో సినిమా 'సెబాస్టియన్ పీసీ 524' మార్చి 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఆయన రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్)తో ఉన్న యువకుడిగా నటించారు. ఆయన సరసన నువేక్ష (నమ్రతా దరేకర్) నటించారు. కోమలీ ప్రసాద్ మరో కథానాయికగా నటించారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion